ప్రముఖ మొబైల్ బ్రాండ్ షావోమి రెడ్‌మి నోట్ 17 ప్రో మొబైల్‌ను త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. మునుపెన్నడూ లేని విధంగా ఐదేళ్ల పాటు బ్యాటరీ ప్రొటెక్షన్ ప్లాన్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. జూలై 14న అధికారికంగా విడుదల కానున్న ఈ సిరీస్ ఫోన్ ఫీచర్లు ఇవే.

9,000mAh బ్యాటరీ
రెడ్‌మి నోట్ 17 ప్రో మోడల్‌లో ఏకంగా 9,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు, అలాగే 22.5W ఫాస్ట్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. తన బ్యాటరీ టెక్నాలజీపై షావోమికి ఎంత నమ్మకం ఉందంటే.. ఈ ఫోన్‌తో పాటు ఐదేళ్ల సరికొత్త ప్రొటెక్షన్ ప్లాన్‌ను అందిస్తోంది. దీని ప్రకారం ఫోన్ కొన్న మొదటి నాలుగేళ్లలో బ్యాటరీ హెల్త్ 80% కంటే తగ్గితే కంపెనీ ఉచితంగా కొత్త బ్యాటరీని రీప్లేస్ చేస్తుంది.

Also Read : ఎథనాల్‌ పెట్రోల్ వెనుక అసలు నిజమేంటి?

ఒకవేళ ఐదో సంవత్సరంలో బ్యాటరీ హెల్త్ 80% కంటే తగ్గితే ఉచితంగా బ్యాటరీని అప్‌గ్రేడ్ చేస్తారు. అంటే ప్రస్తుతమున్న 9,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీని ఉచితంగా వేసి ఇస్తారు. దీనివల్ల ఐదో ఏడాది మీ ఫోన్ 10,000mAh బ్యాటరీ సామర్థ్యానికి మారుతుంది. అయితే ఈ ఆఫర్ కేవలం లాంచ్ సమయంలో ఫోన్ కొనుగోలు చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది.

ఇక ఐదేళ్ల తర్వాత కూడా ఫోన్ ఎక్కడా స్లో అవ్వకుండా రన్ అవ్వడం కోసం షావోమి తన ‘HyperOS’ సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేకమైన మార్పులు చేసింది. బ్యాక్‌గ్రౌండ్ యాప్‌ల ఆప్టిమైజేషన్, వేగవంతమైన యాప్ స్టార్టప్ టైమ్స్, స్టోరేజ్ వేగం తగ్గకుండా ఉండేందుకు ‘వేర్ లెవెలింగ్’ సాంకేతికతను ఇందులో ఉపయోగించారు. దీనివల్ల ఐదేళ్ల తర్వాత కూడా ఫోన్ రీడింగ్/రైటింగ్ స్పీడ్స్ కొత్త ఫోన్‌లానే అద్భుతంగా ఉంటాయి.

రెడ్‌మి నోట్ 17 ప్రో కేవలం సాఫ్ట్‌వేర్ పరంగానే కాకుండా, బాడీ పరంగానూ అత్యంత దృఢంగా డిజైన్ చేశారు. ఈ ఫోన్ డిస్‌ప్లే రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను అందించారు. మూడు మీటర్ల ఎత్తు నుంచి మార్బుల్‌పై పడేసినా స్క్రీన్‌కు ఏం కాదని కంపెనీ తెలిపింది. నీరు, ధూళి నుండి రక్షణ కోసం దీనికి IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఇచ్చారు. అంటే నీటి ధారలు, వరదలు లేదా ఫోన్ నీటిలో మునిగినా సరే సురక్షితంగా ఉంటుంది.

వినియోగదారుల భద్రత కోసం ఈ ఫోన్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్ యాడ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో జరిగే ఫేస్ స్వాపింగ్ మోసాలను, అనుమానాస్పద స్కామ్ కాల్స్‌ను ఈ ఫోన్ ముందుగానే గుర్తించి యూజర్లను అలర్ట్ చేస్తుంది. షావోమి సంస్థ జూలై 14న ‘రెడ్‌మి నోట్ 17’, ‘రెడ్‌మి నోట్ 17 ప్రో’ మోడళ్లను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయనుంది. అయితే వీటి ధరను అధికారికంగా ఇంకా నిర్ధారించలేదు. రూ.40 వేల నుంచి దీని ధర ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Also Read : గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. హర్మూజ్‌లో మళ్లీ హైటెన్షన్.. భారీగా పెరగనున్న ధరలు?