Horoscope 2026 Today
Horoscope 2026 Today

మేషం
చేసే పనిపై శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే విజయం సాధిస్తారు. ఇష్టదైవాన్ని ప్రార్థించడం మంచిది.

వృషభం
కుటుంబ సభ్యుల సహాయంతో అనుకున్న పనులు సులువుగా పూర్తవుతాయి. సమయానికి డబ్బు సహాయం అందుతుంది. అనుకున్న పనులన్నీ అనుకూలిస్తాయి. లక్ష్మీ దేవి ప్రార్థన శుభం కలిగిస్తుంది.

మిథునం
ఇంట్లో ఒక మంచి వార్త సంతోషాన్ని ఇస్తుంది. డబ్బుకు సంబంధించిన విషయాలు కలిసివస్తాయి. పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. నవగ్రహ స్తోత్రం చదవడం మంచిది.

కర్కాటకం
ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. అధికారుల సహాయంతో పనులు విజయవంతమవుతాయి. శివారాధన మేలు చేస్తుంది.

సింహం
తెలివితో తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీస్సులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. శివాలయాన్ని సందర్శించడం శుభప్రదం.

కన్య
పరిస్థితులు అనుకూలించి పనులు పూర్తవుతాయి. మంచి వార్త వినడం వల్ల ధైర్యం పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఇష్టదైవాన్ని స్మరించండి.

Also Read : గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. WGC సంచలన నివేదిక.. త్వరలోనే పెరగనున్న ధరలు

తుల
ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి పురోగతి ఉంటుంది. విష్ణు సహస్రనామం చదవడం మంచిది.

వృశ్చికం
బంధుమిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు. ప్రణాళికతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. శివనామ స్మరణ శుభం కలిగిస్తుంది.

ధనుస్సు
కష్టపడి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కలిసివస్తాయి. ఇష్టదైవారాధన మంచిది.

మకరం
పనుల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఒక ముఖ్యమైన సమస్య తీరి శత్రువులపై విజయం సాధిస్తారు. వెంకటేశ్వర స్వామిని పూజించండి.

కుంభం
ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఈశ్వరారాధన మేలు చేస్తుంది.

మీనం
స్థిరమైన ఆలోచనతో ముందుకు సాగాలి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. నవగ్రహాలను ధ్యానించడం మంచిది.

Also Read : ఉదయాన్నే ఇలా వాటర్ తాగుతున్నారా.. అయితే మీరు ఈ సమస్యల బారిన పడినట్లే!