
BJP : భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే ప్రచారానికి తెరలేపారు. ఆయన తన ఎక్స్ ఖాతాలోని బయోలో జాతీయ అధికార ప్రతినిధి, బీజేపీ అనే హోదాను తొలగించడంతో ఈ ఊహాగానాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అదే సమయంలో, తాను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించి ఆలోచిస్తున్నట్లు పేర్కొన్న పాత ఇంటర్వ్యూ క్లిప్‌లను కూడా పూనావాలా రీపోస్ట్ చేశారు. అయితే ఈ విషయంపైన ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
Also Read : GENERATION GUTTER : కంగనా కొత్త వివాదం!
ఆయన తన ఎక్స్ బయోను మార్పులు చేస్తూ ఒక స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. అందులో “మతం: ఇస్లాం, సంస్కృతి: హిందూ, సిద్ధాంతం: భారతీయ, రచయిత: జీఎస్టీ కీ యాత్రా; ప్రధాని నరేంద్ర మోదీకి ఆజన్మ అనుచరుడు” అని రాసి ఉంది. తన ఎక్స్ బయోను మార్చినట్లు స్క్రీన్‌షాట్ షేర్ చేసిన దాదాపు రెండు గంటల తర్వాతే ఆయన ఈ రెండు వీడియోలను రీట్వీట్ చేయడం విశేషం.
ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, టెలివిజన్ వార్తా ఛానెళ్ల చర్చల్లో, రాజకీయ వేదికలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పూనావాలా నిత్యం కనిపిస్తుంటారు. 2021లో ఆయనను ఢిల్లీ బీజేపీ సోషల్ మీడియా వింగ్ ఇన్‌చార్జిగా నియమించారు. వృత్తిరీత్యాన్యాయవాది అయిన 38 ఏళ్ల పూనావాలా, తన రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్‌తో ప్రారంభించారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఎదగడంలో వంశపారంపర్య రాజకీయాల పాత్ర ఉందంటూ 2017లో తన మాజీ పార్టీపై బహిరంగంగా తిరుగుబాటు చేసి ఆయన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.
Also Read : ప్రధానిగా రాజీనామా చేసి ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా మారండి….మోదీపై సీజేపీ అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు









