
Delhi : ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఆదివారం మధ్యాహ్నం ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. మరికొందరి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఈ భవనాన్ని విద్యార్థుల కోసం పేయింగ్ గెస్ట్ వసతిగా ఉపయోగిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భవనం కూలిపోయింది. ఆదివారం కావడంతో భవనంలో సుమారు 50 మంది విద్యార్థులు ఉండి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
Also Read : సిబిల్ స్కోర్ పడిపోయిందా? ఈ 6 ట్రిక్స్‌తో జస్ట్ 6 నెలల్లో పెరగడం గ్యారెంటీ!
భవనం కూలిన వెంటనే అక్కడ ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. శిథిలాల కింద నుంచి సహాయం కోసం అరుపులు వినిపించాయని ఓ విద్యార్థి తెలిపాడు. దీంతో లోపల మరికొందరు చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో అధికారులు సహాయక చర్యలను వేగంగా చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 12కి పైగా ఫైర్ ఇంజిన్లను తరలించారు. శిథిలాల్లో ఉన్న సిమెంట్ దిమ్మలు, ఇనుప కడ్డీలను తొలగించేందుకు ఎక్స్‌కవేటర్‌ను కూడా తీసుకొచ్చారు. విపత్తు నిర్వహణ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
సత్య నికేతన్ ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉంటారు. ప్రమాదం విషయం తెలియగానే విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపై అధికారులు పూర్తిస్థాయిలో గాలింపు కొనసాగిస్తున్నారు.
Also Read : సచిన్ టెండూల్కర్ కీలక నిర్ణయం.. తండ్రిపేరిట ఫెలోషిప్









