Raghava Lawrence, CM Vijay
Raghava Lawrence, CM Vijay

రాఘవ లారెన్స్.. ఈ పేరు వినగానే ఎంతోమంది పేదలు దండం పెడతారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు అనాథ పిల్లలకు అండగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా వికలాంగులు, పేదలకు సామాజిక సేవ చేస్తూ సమాజంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని.. ఇంకా ఎంతో మందికి తోడుగా నిలుస్తాడని అంతా భావించారు.

ఈ నేపథ్యంలోనే లారెన్స్ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి ఉప ఎన్నికల్లో టీవీకే పార్టీ తరపున ఆయన పోటీ చేస్తారని టాక్ వినిపించింది. అయితే ఈ ప్రచారంపై రాఘవ లారెన్స్ స్పందించి సీఎం విజయ్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని అభిమానులకు వివరించారు.

ఇంతకీ లారెన్స్ ఏం చెప్పాడు?.. తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనే విషయానికొస్తే.. తమిళనాడు ఎన్నికల్లో సీఎం విజయ్ రెండు చోట్ల పోటీ చేసి గెలవగా.. అందులో తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. దీంతో ఆ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. అప్పుడే ఆ సీటును విజయ్ టీవీకే పార్టీ తరపున రాఘవ లారెన్స్‌కు ఇస్తారని జోరుగా ప్రచారం సాగింది. దీనిపై లారెన్స్ కూడా స్పందించి.. ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమంటూ తెలిపారు.

Also Read : జైపూర్‌లో ఘోరం: మరో ఎగ్జామ్ స్కామ్..రూ. 5లక్షలు ఇస్తే పాస్..

దీంతో అభిమానుల ఆనందంతో మురిసిపోయారు. కానీ తాజాగా లారెన్స్ చేసిన ప్రకటన అందరినీ షాక్‌కు గురిచేసింది. తాను రాజకీయాల్లోకి రావడం లేదంటూ అధికారికంగా ఓ వీడియో రూపంలో తెలిపారు. ఈ మేరకు కీలక వ్యా్ఖ్యలు చేశారు. ఒక పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి, చెమటోడ్చిన వారు ఎందరో ఉన్నారని, పార్టీ కోసం అహర్నిషశలు శ్రమించిన వారే ఆ పదవులకు అర్హులని అన్నారు. మధ్యలో వచ్చిన తాను ఆ టికెట్ ఆశించడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఒకవేళ తాను రాజకీయాల్లో వస్తే.. సాధారణ కార్యకర్తలా కొన్నేళ్లు గ్రౌండ్‌ వర్క్ చేసి వస్తానని తెలిపారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కొత్త సినిమాలపైనే ఉందని.. నటుడిగా ఉంటూనే ఎంతో మంది పేద పిల్లలకు సహాయం చేస్తానని పేర్కొన్నారు. దీంతో తిరుచ్చి ఈస్ట్ నుంచి తాను పోటీ చేయడం లేదని లారెన్స్ అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు.

Also Read : వాట్సాప్‌లో సూపర్ ప్రైవసీ ఫీచర్.. ఫోన్ నంబర్ లేకుండానే చాట్ చేసుకునే చాన్స్!