
Karnataka : ప్రముఖ ఇ-కామర్స్, క్విక్ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ సంస్థలకు కర్ణాటక ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆరోగ్యానికి హాని చేసే విషపూరితమైన ‘దతూర’ పండ్లు, విత్తనాలను ఆహార పదార్థాలుగా తమ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయిస్తున్నందుకు ఈ కంపెనీల ఆహార లైసెన్సులను కర్ణాటక ఆహార భద్రత, ఔషధాల పరిపాలన విభాగం తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
Also Read : బిహార్‌లో మొదలైన జెన్ జీ మూమెంట్.. హై టెన్షన్!
Karnataka suspends Amazon, Instamart, BigBasket food licences over poisonous datura sale
READ: https://t.co/tCISsqvK3lhttps://t.co/tCISsqvK3l
— WION (@WIONews) August 25, 2026
ఇ-కామర్స్ యాప్‌లలో ప్రమాదకరమైన ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీవ్రమైన విషపూరిత గుణాలు కలిగిన దతూర పండ్లు, విత్తనాలను కొన్ని ప్యాకెట్లపై FSSAI ఆహార లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్లను ముద్రించి మరీ గిడ్డంగుల్లో నిల్వ ఉంచారు. ప్రజలు తినే ఆహార పదార్థాలుగా ఆన్లైన్లో విక్రయానికి ప్రదర్శించారని అధికారులు గుర్తించారు. ఈ ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మనుషుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ఈ నిబంధనల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాల్సిందిగా సంబంధిత కంపెనీల ప్రతినిధులను అధికారులు ఆదేశించారు:
Also Read : నెలకు రూ.10 వేలతో కోటి రూపాయలు.. ఎలాగో మీకు తెలుసా?
ప్రభుత్వం ఇచ్చిన ఈ నోటీసులపై అమెజాన్ ఎలాంటి స్పందనను సమర్పించలేదు. ఇన్‌స్టామార్ట్ తాము తీసుకున్న చర్యలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు మరింత సమయం కావాలని కోరింది. బిగ్‌బాస్కెట్ తమ ప్లాట్‌ఫారమ్‌లో ఆ పండ్ల విక్రయాలను నిలిపివేశామని, భవిష్యత్తులో వాటిపై “మానవ వినియోగానికి కాదు” అని స్పష్టంగా రాస్తామని తెలిపింది. అయితే ఈ కంపెనీలు ఇచ్చిన వివరణలు ఎంతమాత్రం సంతృప్తికరంగా లేవని నియంత్రణ సంస్థ పేర్కొంది. విషపూరితమైన పదార్థాలను ఆహారంగా అమ్మడం లేదా నిల్వ చేయడం చట్టరీత్యా నేరమని తేల్చిచెప్పింది.
ఈ ఘటనపై కఠినంగా వ్యవహరించిన అధికారులు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌ల ఆహార లైసెన్సులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీలు పూర్తి స్థాయి స్పందన సమర్పించి సమగ్ర విచారణ పూర్తయిన తర్వాతే లైసెన్సుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ఈ సంస్థలకు దతూర ఉత్పత్తులను సరఫరా చేసిన విక్రేతలు, సప్లయర్ల లైసెన్సులను కూడా తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. ఆన్లైన్ యాప్‌ల నుంచి దతూర ఉత్పత్తులకు సంబంధించిన అన్ని రకాల ప్రకటనలు, లిస్టింగ్‌లను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు.









