Electoral Bond Donations : రాజకీయ పార్టీలకు విరాళాలు రావడం సర్వసాధారణం. వ్యక్తులు, వివిధ సంస్థలు తమకు నచ్చిన పార్టీలకు విరాళాలు ఇస్తూ ఉంటాయి. అయితే ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2024లోనే తీర్పునిచ్చింది. అయితే 2023-24లో వచ్చిన విరాళాల ఆధారంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీగా తృణమూల్‌ కాంగ్రెస్‌ నిలిచింది. రెండవ పార్టీగా బీఆర్‌ఎస్‌ నిలిచింది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా 2023-24లో బీఆర్‌ఎస్‌కు రూ.495.52కోట్ల విరాళాలు అందినట్లు ఏడీఆర్‌ వెల్లడించింది. దేశవ్యాప్తంగా చూస్తే అత్యధికంగా తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఏకంగా రూ.612 కోట్ల విరాళాలు అందినట్లు నివేదిక వెల్లడించింది. బిజూ జనతాదళ్‌ (రూ.245 కోట్లు)తో మూడోస్థానం, టీడీపీ (రూ.174 కోట్లు)తో నాలుగో స్థానం, వైసీపీ (రూ.121 కోట్లు) తో ఐదో స్థానంలో నిలిచినట్లు ఏడీఆర్‌ వివరించింది. 2023-24, 2024-25 మధ్య కాలంలో 40 ప్రాంతీయ రాజకీయ పార్టీలకు రూ.20వేలకుపైగా అందిన విరాళాలు, ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా వచ్చిన నిధుల వివరాలను ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) ఒక నివేదికను విడుదల చేసింది.

Also Read : ఆ సమయంలోనే NEET పేపర్ లీక్.. CBI ఛార్జ్షీట్లో సంచలన నిజాలు

ఏడీఆర్‌ నివేదిక ప్రకారం దేశంలోని ప్రాంతీయ పార్టీలకు ఎలక్టోరల్‌ బ్లాండ్ల ద్వారా 2023-24లో మొత్తంగా రూ.1820.02 కోట్లు అందాయి. నిజానికి ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని 2024 ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే అంతకన్న ముందు ఆయా పార్టీలకు అందిన విరాళాలనే ఏడీఆర్‌ నివేదిక వివరించింది. బాండ్ల రద్దు కంటే ముందు అన్ని రాజకీయ పార్టీలకు రూ.20వేల కన్నా ఎక్కువ మొత్తంలో వచ్చిన విరాళాలు కేవలం రూ.347.69కోట్లు మాత్రమే. కానీ, బాండ్ల రద్దు తర్వాత 2024-25లో విరాళాలు ఏకంగా రూ.1,051కోట్లకు చేరుకోవడం గమనార్హం.

ఇక వచ్చిన విరాళాల నుంచి 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించిన మొత్తం విరాళాల్లో 60శాతం కంటే ఎక్కువ వాటా డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌, వైసీపీ, టీడీపీదే అగ్రస్థానం. 2023-24లో టీడీపీ అత్యధికంగా రూ.100.18 కోట్ల విరాళాలను ప్రకటించింది. కానీ, 2024-25కి వచ్చేసరికి మాత్రం రూ.83 కోట్లు మాత్రమే ప్రకటించింది. 2023-24లో కేవలం 4 విరాళాల ద్వారానే వైసీపీకి ఏకంగా రూ.62.50 కోట్లు వచ్చినట్లు ప్రకటించింది. 2024-25లో 37 విరాళాల ద్వారా రూ.140 కోట్లను ఆర్జించింది. జనసేన పార్టీకి 2023-24లో విరాళాల ద్వారా రూ.36 కోట్లు వస్తే, 2024-25లో రూ.25 కోట్లు మాత్రమే వచ్చినట్లు ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. 2024-25లో రూ.365.78 కోట్ల విరాళాలతో డీఎంకే మొదటిస్థానంలో నిలవగా, రూ.184.96 కోట్ల విరాళాలతో తృణమూల్‌ కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది. రూ.140 కోట్లతో వైసీపీ , రూ.83 కోట్లతో టీడీపీ నాలుగో స్థానం, రూ.66 కోట్లతో అన్నాడీఎంకే ఐదో స్థానంలో నిలిచింది. కాగా, 2023-24లో బీఆర్‌ఎస్‌ 8 విరాళాల ద్వారా రూ.85 కోట్లను ఆర్జించింది. 2024-25 నాటికి 4 విరాళాల ద్వారా కేవలం రూ.15 కోట్లను మాత్రమే ఆర్జించడం గమనార్హం. మొత్తంగా చూస్తే పార్టీల విరాళాలు 82 శాతానికి పైగా తగ్గినట్లు ఏడీఆర్‌ నివేదిక తెలిపింది.

Also Read : బయోగ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు రూ. 23,731 కోట్లతో ‘గోబర్ధన్’ పథకం…ఎందుకో తెలుసా?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.