Amazon Prime Day Sale 2026
Amazon Prime Day Sale 2026

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ amazon జూలై 4 నుంచి prime day sale ప్రారంభించనుంది. ఈ సేల్ 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో వన్‌ప్లస్ మొబైళ్లకు సంబంధించి పలు సిరీస్‌లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. అలాగే వన్‌ప్లస్ స్టోర్, వన్‌ప్లస్ ఇండియా వెబ్ సైట్‌ నుంచి కూడా స్మార్ట్‌ఫోన్లను డిస్కౌంట్‌తో కొనుక్కోవచ్చు. ఇప్పుడు amazon prime day sale లో తక్కువ ధరకే లభించనున్న oneplus మొబైల్స్ గురించి తెలుసుకుందాం

వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లోని oneplus nord 6 ధర రూ.39,999గా ఉంది. oneplus nord CE 6 ధర రూ.29,999 కాగా.. వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్ ధర రూ.22,999గా అందుబాటులో ఉంది. కాగా oneplus nord పై రూ.3,000 వరకు, నార్డ్ CE మోడళ్లపై రూ.2,000 వరకు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే నార్డ్ సిరీస్‌పై ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి.

Also Read : తగ్గిన ముడిచమురు ధరలు… దిగిరాని పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..ఎందుకో తెలుసా?

అలాగే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వస్తే.. oneplus 13 రూ.49,999కి అందుబాటులో ఉంది. oneplus 13s రూ.3,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత ఇది రూ.46,999కి దొరుకుతుంది. ఈ రెండు ఫోన్‌లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటాయి.

వీటితో పాటు oneplus 15 సిరీస్‌పై కూడా ఆఫర్లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ల తర్వాత వన్‌ప్లస్ 15ను రూ.81,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 15R పై రూ.3,000 డైరెక్ట్ ధర తగ్గింపుతో పాటు రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్లను కలిపితే ఈ ఫోన్‌ను రూ.48,999లకి కొనుక్కోవచ్చు.

ఫోన్లు మాత్రమే కాకుండా టాబ్లెట్లపై కూడా అనేక ఆఫర్లు ఉన్నాయి. వన్‌ప్లస్ ప్యాడ్ 4 రూ.55,999కి లభిస్తుంది. దీంతో పాటు రూ.5,499 విలువైన వన్‌ప్లస్ స్టైలో ప్రో ఉచితంగా వస్తుంది. వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ రూ.16,999కి, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 రూ.26,499కి అందుబాటులో ఉన్నాయి. ప్యాడ్ గో 2 తో పాటు రూ.3,999 విలువైన స్టైలో ప్రో కూడా ఫ్రీగా లభిస్తుంది.

ఆడియో ప్రొడెక్టులు కూడా తగ్గింపు ధరలకు లభిస్తాయి. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 రూ.3,099గా ఉంది. అదనంగా వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ Z2 ANC రూ.1,899కి, నార్డ్ బడ్స్ 3R రూ.1,599కి, నార్డ్ బడ్స్ 4 ప్రో రూ.3,799కి, వన్‌ప్లస్ బడ్స్ 4 రూ.5,599కి, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 రూ.9,999కి అందుబాటులో ఉన్నాయి.

Also Read : బంగారం అమ్మేస్తున్న ఇండియన్స్‌..కారణం తెలిస్తే షాక్‌?