
అమెరికాలో చదువుకుంటున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఫారిన్ జర్నలిస్టులకు అక్కడి ఫెడరల్ కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. వీసాల నివాస గడువు పరిమితిని కుదిస్తూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చిన కొత్త రూల్స్‌ను యూఎస్ ఫెడరల్ జడ్జి కొట్టివేశారు. 2026లో డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) తెచ్చిన ఈ నిబంధన ఏకపక్షంగా, అధికార దుర్వినియోగంతో ఉందని జడ్జి ఎఫ్. డెన్నిస్ స్లేయర్ వ్యాఖ్యానించారు. విదేశీ విద్యార్థులకు అవకాశాలు కల్పించడం కాంగ్రెస్ బాధ్యతని, దానిని DHS అడ్డుకోవాలని చూస్తోందని కోర్టు అభిప్రాయపడింది.
Also Read : వాషింగ్టన్‌పై ఇరాన్ ‘డర్టీ బాంబ్’.. ట్రంప్ టీమ్ టార్గెట్‌గా కుట్ర!
పాత రూల్స్ vs కొత్త రూల్స్ :
గతంలో F-1 (స్టూడెంట్స్), J-1 (రీసెర్చర్స్, ప్రొఫెసర్లు) వీసాదారులు తమ కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండే వెసులుబాటు ఉండేది. కానీ ట్రంప్ సర్కారు దీన్ని 4 ఏళ్లకు కుదించింది. అలాగే జర్నలిస్టుల (I-వీసా) గడువును 5 ఏళ్ల నుంచి 240 రోజులకు (చైనా జర్నలిస్టులకు 90 రోజులకు) తగ్గించింది. దీనిపై సెప్టెంబర్ 14నే స్టే ఇచ్చిన కోర్టు, తాజాగా ఆ రూల్స్‌ను పూర్తిగా రద్దు చేయడంతో వేలాది మందికి ఊరట లభించింది.
కోర్టు మొట్టికాయలు వేస్తున్నా, ఫారిన్ ఎంప్లాయీస్ విషయంలో ట్రంప్ సర్కారు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా గ్రీన్ కార్డ్ ప్రక్రియలో కీలకమైన ‘పెర్మ్’ నిబంధనల్లో మార్పులు ప్రతిపాదించింది. దీని ప్రకారం, ముఖ్యంగా టెక్, అవుట్సోర్సింగ్ కంపెనీలు అమెరికన్ ఉద్యోగులకు లేఆఫ్స్ ఇస్తే.. ఆ తర్వాత రెండేళ్ల పాటు అదే పొజిషన్లలో విదేశీ ఉద్యోగుల కోసం PERM అప్లై చేయడానికి వీల్లేదు.
క్వాలిఫైడ్ అమెరికన్లు దొరకడం లేదని కంపెనీలు నిరూపించడంతో పాటు, కొత్తగా సైంటిస్టులు, హై-స్కిల్డ్ ప్రొఫెషనల్స్, నర్సుల నియామకాలకు కూడా ఈ కఠిన నిబంధనలను వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Also Read : నేను బతికే ఛాన్స్ లేదు.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు









