
Aamir Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లిపై మహారాష్ట్ర మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమిర్ ఖాన్ మూడవ వివాహాన్ని లవ్ జిహాద్ కోణంలో చూడాలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Also Read : నా తండ్రి బతిమిలాడితే చూశాను .. భాగ్యశ్రీ ఎమోషనల్!
అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డీలో నితేష్ రాణే మీడియాతో మాట్లాడుతూ, ప్రముఖ సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితంలో తీసుకునే ఇటువంటి నిర్ణయాల పట్ల హిందూ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లవ్ జిహాద్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆమిర్ ఖాన్ దానికి ఒక ఉదాహరణగా మారుతున్నారా? అని ఆయన నిలదీశారు. అటువంటి వ్యక్తుల సినిమాలను చూసేటప్పుడు హిందూ యువత మరోసారి ఆలోచించుకోవాలని, వారిని సెలబ్రిటీలుగా నెత్తిన పెట్టుకోవడంపై పునరాలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆమిర్ ఖాన్ మూడవ వివాహాన్ని లవ్ జిహాద్ కోణంలో చూడాలనే చర్చ సమాజంలో పెరుగుతోందని రాణే పేర్కొన్నారు. మతమార్పిడి లక్ష్యంగా ముస్లిం పురుషులు ఇతర మతాలకు చెందిన మహిళలను వివాహం చేసుకుంటారనే ఆరోపణలను లవ్ జిహాద్ గా మితవాద సంస్థలు పరిగణిస్తుంటాయి.
కాగా, ఆమిర్ ఖాన్ తన పాలి హిల్ నివాసంలో జూలై 5న గౌరీ స్ప్రాట్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆమిర్ ఖాన్‌కు రీనా దత్తా (1986-2002), కిరణ్ రావు (2005-2021)లతో వివాహాలు జరిగాయి. ఈ వివాదంపై ఆమిర్ ఖాన్ ఇప్పటివరకు ఎటువంటి స్పందన తెలియజేయలేదు.
Also Read : హీరో ఆర్యకు బిగ్ షాక్.. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు!









