CM Vijay : తమిళనాడు సీఎం విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యక్తిగత విభేదాల కారణంతో విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగీత, తాజాగా ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. ఆమె నిర్ణయంతో చెంగల్పట్టు జిల్లా కోర్టు ఈ కేసు విచారణను ముగించింది. దీంతో గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న ఈ వివాదానికి ముగింపు పడినట్లు అయింది.

Also Read : నేషనల్ హ్యాండ్‌లూమ్ డే: ప్రధాని మోదీకి మంగళగిరి చేనేత వస్త్రం గిఫ్ట్!

గత ఏడాది డిసెంబర్‌లో సంగీత విడాకులు కోరుతూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో.. భర్త విజయ్‌తో ఏర్పడిన మనస్పర్థలు దృష్ట్యా తనకు భరణంతో పాటుగా నీలాంగరైలోని ఇంట్లో నివసించే హక్కును కల్పించాలని కోరింది. ఈరోజు విచారణకు సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈరోజు తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున, నేరుగా లేదా వర్చువల్‌గా హాజరయ్యేందుకు వీలులేక కేసు విచారణను మరొక తేదీకి వాయిదా వేయాలని విజయ్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.

ఇలాంటి టైమ్ లో సంగీత తన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం సంచలనంగా మారింది. మళ్లీ విజయ్ తో కలిసి ఉండటానికి ఆమె నిర్ణయించుకుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా విజయ్, సంగీత వివాహం 1999 ఆగస్టు 25న హిందూ సంప్రదాయాల ప్రకారం చెన్నైలో వైభవంగా జరిగింది.వీరిద్దరిదీ ప్రేమ వివాహం. సంగీత లండన్‌ లో స్థిరపడిన శ్రీలంక తమిళ బిజినెస్ మెన్ కుమార్తె. విజయ్ నటించిన పూవే ఉనక్కాగా సినిమా చూసి అభిమానిగా చెన్నై వచ్చి ఆయన్ను కలిశారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లిపీటలెక్కింది. వీరికి జాసన్ సంజయ్, దివ్య షాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Also Read : బయోగ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు రూ. 23,731 కోట్లతో ‘గోబర్ధన్’ పథకం…ఎందుకో తెలుసా?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.