Shabad Murder Case : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సంచలనం సృష్టించిన దారుణ హత్యల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే అతడి మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజ్‌కుమార్ హత్యలకు ఒడిగట్టడానికి ముందు, జూలై 10వ తేదీ సాయంత్రం 4:55 గంటల సమయంలో రికార్డు చేసిన సంచలన సెల్ఫీ వీడియో ఈ ఫోన్‌లో లభ్యమైందని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ (CP) తరుణ్ జోషి అధికారికంగా ధ్రువీకరించారు.

Also Read : 9ఏళ్ల చిన్నారికి చనిపోయేంత కష్టం ఏమొచ్చింది?

ఆ సెల్ఫీ వీడియోలో రాజ్‌కుమార్ తను ఎదుర్కొన్న తీవ్ర మానసిక క్షోభ, ఆర్థిక నష్టాలను వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. “నా సంపాదనలో సగం వారి కోసమే ఖర్చు చేశాను, నన్ను నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజి అప్పుల పాలు చేశారు. చివరికి నా పిల్లలకు రూపాయి విలువైన భూమి కూడా లేకుండా చేశా. అంతటితో ఆగకుండా నాపైనే తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారు” అని వ్యాఖ్యానించాడు. ఆ అమ్మాయిని నమ్మి మోసపోయాననే కక్ష, అప్పుల పాలయ్యాననే తీవ్ర నైరాశ్యంతోనే అతడు ఈ ఘాతుకానికి తెగబడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Also Read : షాబాద్‌ మర్డర్ కేసులో సంచలనాలు.. కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకెళ్లి

ఇదిలా ఉండగా, రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమైన ఘటనా స్థలంలో అతడి సోదరుడు వ్యక్తం చేసిన ఆవేదన పలువురిని కలచివేసింది. నిందితుడు అంతమందిని బలితీసుకుని, చివరికి తనకు తాను ప్రశాంతంగా చనిపోయే అవకాశం దక్కిందని అతడి సోదరుడు కన్నీటి పర్యంతమయ్యాడు. “ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన వాడిని పోలీసులు నేరుగా ఎన్‌కౌంటర్ చేసి కాల్చి చంపేసినా బాగుండేది. కనీసం ఆ చిన్న పిల్లలనైనా నేను పెంచి పెద్ద చేసుకునేవాడిని కదా” అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను, సెల్ఫీ వీడియోను మరింత లోతైన సాంకేతిక విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)కి పంపించినట్లు సీపీ తరుణ్ జోషి తెలిపారు. ఈ వీడియో ఆధారంగా కేసులోని మరిన్ని సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ, దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.