Bengaluru :  బెంగళూరులో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. మనోజ్ (28), స్వప్న (28) అనే దంపతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంగఢ్‌కు చెందినవారు. వీరికి పెళ్లయి మూడేళ్లు అవుతోంది. వీరు బెంగళూరులో మనోజ్ తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు. మనోజ్ వృత్తిరీత్యా వడ్రంగి (కార్పెంటర్), అయితే గత నాలుగు రోజులుగా అతను పనికి వెళ్లడం లేదని తెలిసింది.

బుధవారం ఈ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో గదిలోకి వెళ్లి లోపలి నుండి తలుపులు వేసుకున్నారు. వారి గొడవ గురించి గమనించిన ఇంటి యజమాని, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని, తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు.

Also Read : 12 ఏళ్ల బాలుదీని నదిలోకి లాకెళ్లి చంపిన మొసలి.. షాకింగ్ వీడియో

అక్కడ మనోజ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో కనిపించగా, భార్య స్వప్న విగతజీవిగా పడి ఉంది. ప్రాథమిక విచారణలో, కుక్కలను కట్టే నైలాన్ బెల్టును (డాగ్ లీష్) ఉపయోగించి మనోజ్ తన భార్యను గొంతు నులిమి చంపి, ఆ తర్వాత అదే బెల్టుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనా స్థలాన్ని క్రైమ్ టీమ్ అధికారులు పరిశీలించారు. అసలు గొడవకు కారణం ఏంటి, ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డారు అనే విషయాలపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also Read : మల్లప్ప కొండలో మిస్టరీ హత్య: భర్త దారుణ హత్య.. భార్య, చిన్నారి అదృశ్యం

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.