Bihar : బిహార్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భోజనం వడ్డించడం ఆలస్యం అయిందన్న కోపంతో ఓ వ్యక్తి తన మరదలిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన బిహార్‌లోని జేహాబాద్ జిల్లా, పార్స్ బిఘా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాద్‌పూర్ గ్రామంలో జరిగింది. హత్య అనంతరం నిందితుడు బాధితురాలి తెగిన తలను వారి ఇంటి ముందున్న ఓ చెట్టుకు వేలాడదీశాడు.

Also Read : వింత దొంగలు.. దేవుడికి మొక్కి మరీ హుండీ ఎత్తుకెళ్లారు!

మృతురాలిని ఇమాద్‌పూర్ గ్రామానికి చెందిన ధర్మేంద్ర కుమార్ భార్య 25 ఏళ్ల అన్షు దేవిగా గుర్తించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు కునాల్ కుమార్ ఒక డ్రగ్ అడిక్ట్. ఘటన జరిగిన సమయంలో అన్షు దేవి ఇంట్లో ఉండగా, కుటుంబ సభ్యులందరూ పొలాలకు వెళ్లారు.

పొలం నుంచి ఇంటికి వచ్చిన కునాల్ కుమార్ తనకు భోజనం పెట్టమని అడిగాడు. భోజనం వడ్డించడం ఆలస్యం కావడంతో విపరీతమైన కోపోద్రిక్తుడై, గొడ్డలి తీసుకుని తన మరదలిపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోకుండా, ఇంటి సమీరంలోనే కూర్చుండిపోయాడు.

ఈ దారుణ హత్య గురించి తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడ గుమికూడారు. వెంటనే ఈ నేరం గురించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఈ హత్యకు ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read : థాయ్‌లాండ్‌లో ‘బడ్జెట్ టూర్’ పేరిట ముగ్గురు భారతీయ యువకుల కిడ్నాప్: ఐదుగురు నిందితుల అరెస్ట్

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.