
Lawrence Bishnoi : బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటనతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మళ్లీ ట్రెండ్ అవుతోంది. కొన్నేళ్లుగా జైలు గోడల మధ్యే బందీగా ఉన్నప్పటికీ, బయట అతని గ్యాంగ్ చేస్తున్న క్రైమ్ యాక్టివిటీస్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీంతో అప్రమత్తమైన జైలు అధికారులు బిష్ణోయ్‌పై నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్న అతడిని, ఇంతకుముందున్న ‘10-సెల్’ బ్లాక్ నుంచి అత్యంత కట్టుదిట్టమైన ‘200 రూమ్’ హైసెక్యూరిటీ బ్లాక్‌కు షిఫ్ట్ చేశారు.
Also Read : అర్నబ్ తుఫాన్‌పై ఏపీ హై అలర్ట్.. రూ.27 కోట్లు రిలీజ్.. స్కూళ్లకు సెలవులు!
ఈ ప్రత్యేక బ్లాక్‌ను నాలుగు సెక్షన్లుగా విభజించగా, ఒక్కో దాంట్లో 50 మంది ఖైదీలు ఉంటారు. ఇక్కడి సెల్స్ 7.5×11 అడుగుల సైజులో ఉంటాయి. ఖైదీలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా 24 గంటల పటిష్టమైన సెక్యూరిటీ, సర్వైలెన్స్ ఉంటుంది. 2008 బాంబ్ బ్లాస్ట్స్ దోషులు కూడా ఇదే హైసెక్యూరిటీ బ్లాక్‌లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు బిష్ణోయ్‌ను కూడా ఇదే సెల్‌కు తరలించారు.
పంజాబ్‌కు చెందిన లారెన్స్ బిష్ణోయ్ 2010 నుంచే హత్యలు, దోపిడీలు లాంటి నేరాలకు పాల్పడ్డాడు. 2014లో అరెస్టయిన తర్వాత పంజాబ్, ఢిల్లీలోని తీహార్ జైళ్లలో ఉన్నాడు. అయితే జైలు నుంచే ఫోన్ల ద్వారా ఎక్స్టార్షన్ బెదిరింపులు చేయడం, తన నెట్‌వర్క్‌కు ఆడియో, వీడియో మెసేజ్‌లు పంపడం, చివరకు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.
డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో గుజరాత్ ATS 2023లో బిష్ణోయ్‌ను అదుపులోకి తీసుకుని సబర్మతి జైలుకు తరలించింది. గత రెండేళ్లుగా అతడు కేవలం లీగల్ టీమ్‌తో మాత్రమే మాట్లాడాడని, కోర్టు కేసులకు వర్చువల్‌గానే హాజరవుతున్నాడని, బయటి వ్యక్తులతో నేరుగా కాంటాక్ట్ లేదని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ బయట బిష్ణోయ్ పేరుతో నేరాలు ఆగడం లేదు. విదేశాల్లో తలదాచుకున్న అతని సన్నిహితులు గోల్డీ బ్రార్, రోహిత్ గొదారా వంటి గ్యాంగ్స్టర్లు ఈ దాడులకు స్కెచ్ వేస్తున్నట్లు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ గుర్తించాయి.
Also Read : US ఎన్నికల్లో భారతీయుల హవా.. అభ్యర్థుల కోసం రూ.226 కోట్ల ఖర్చు









