US Elections 2026 : నవంబర్ 3న జరగనున్న US ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ అభ్యర్థులు డాక్టర్ అమీష్ షా, పియా దండియా హాట్ టాపిక్‌గా మారారు. వీరి గెలుపోటములను ప్రభావితం చేసేందుకు ప్రధాన సూపర్ ప్యాక్‌లు కోట్ల రూపాయల నిధులను ప్రకటనల రూపంలో కుమ్మరిస్తున్నాయి. తాజా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ (FEC) ఫైలింగ్స్ ప్రకారం, వీరిద్దరి నియోజకవర్గాల్లో ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు దాదాపు $23.89 మిలియన్లు (రూ. 226 కోట్లకు పైగా) వ్యయం నమోదైంది.

Also Read : తెలుగు రాష్ట్రాలకు అర్నబ్ తుఫాను హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

అరిజోనా 1వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి మాజీ స్టేట్ లెజిస్లేటర్, వైద్యుడు డాక్టర్ అమీష్ షా బరిలో నిలవగా.. డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, మాజీ NFL కిక్కర్ జే ఫీలీ రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఫీలీకి చెక్ పెట్టేందుకు డెమోక్రటిక్ అనుకూల ‘హౌస్ మెజారిటీ ప్యాక్’ టీవీ, డిజిటల్ ప్రకటనల కోసం భారీగా ఖర్చు చేస్తోంది. మరోవైపు, రిపబ్లికన్ గ్రూపులు సైతం ప్రచార చివరి వారాల్లోనే ఫీలీకి మద్దతుగా దాదాపు $20.8 మిలియన్లకు పైగా వెచ్చించినట్లు సమాచారం.

ఫ్లోరిడా 22వ డిస్ట్రిక్ట్‌లో పియా దండియా, రిపబ్లికన్ అభ్యర్థి కేసీ అస్కార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ రిపబ్లికన్లకు 38,500 ఓటర్ల లీడ్ ఉన్న రీడ్రాన్ జిల్లా కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. కేసీ అస్కార్‌కు వ్యతిరేకంగా హౌస్ మెజారిటీ ప్యాక్ ఏకంగా $7.8 మిలియన్లు (సుమారు ₹74 కోట్లు) టీవీ, రేడియో, డిజిటల్ ప్రకటనల కోసం కుమ్మరించింది.

దీనికి ప్రతిగా MAGA ఇంక్ అనుబంధ సూపర్ ప్యాక్‌లు మరియు సేఫ్టీ అండ్ అఫర్డబిలిటీ పీఏసీ, నో గోయింగ్ బ్యాక్ పీఏసీ వంటి సంస్థలు అమీష్ షా, పియా దండియాలకు వ్యతిరేకంగా వందల కోట్ల రూపాయలు ప్రచారంలో ఖర్చు చేస్తున్నాయి. వీటికి అదనంగా చిన్న గ్రూపులు సైతం డోర్ టు డోర్ క్యాంపెయిన్, ఫోన్ బ్యాంకింగ్, డైరెక్ట్ మెయిల్స్ ద్వారా విపరీతంగా నిధులను ప్రవహింపజేస్తున్నాయి. వెరసి, నవంబర్ 3 పోరు ఇరువర్గాల మధ్య కాస్ట్లీ పొలిటికల్ వార్‌గా మారింది.

Also Read : బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి