
యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ దాడులతో సౌదీ అరేబియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సౌదీకి చెందిన కీలక ఆయిల్ రిఫైనరీలు, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై హౌతీలు అత్యాధునిక డ్రోన్లు, మిస్సైల్స్‌తో నిరంతరం దాడులు చేస్తున్నారు. ఈ దాడులను అడ్డుకోవడం సౌదీ డిఫెన్స్ సిస్టమ్‌కు పెద్ద సవాలుగా మారింది. ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్‌పై తీవ్ర ప్రభావం పడుతుండటంతో, ఎలాగైనా హౌతీలతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని సౌదీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
చమురు ఎగుమతులను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం, దాడులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా సౌదీ అరేబియా ఒక భారీ ఆఫర్‌ను ముందుకు తెచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హౌతీలతో పూర్తిస్థాయి సీజ్ఫైర్ (కాల్పుల విరమణ) ఒప్పందం కోసం సుమారు 1 బిలియన్ డాలర్లను ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో దీని విలువ దాదాపు రూ. 9,500 కోట్లు.
ఈ సంక్షోభ పరిష్కారం కోసం ప్రాంతీయ దౌత్యం వేగవంతమైంది. సౌదీ డిఫెన్స్ మినిస్టర్ ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్ ఇటీవల ఆకస్మికంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వెళ్లడం గల్ఫ్ పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది. హౌతీలకు అండగా ఉండే ఇరాన్, ఈ శాంతి ఒప్పందంలో కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరింత ఆసక్తికరంగా, ఈ చర్చల ప్రక్రియలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కూడా భాగస్వామి అయినట్లు సమాచారం.
ఇజ్రాయిల్ మీడియా సంస్థ ‘ఇజ్రాయిల్ హయోమ్’ వెల్లడించిన కథనం ప్రకారం.. సౌదీ రక్షణ మంత్రి ప్రయాణించిన ‘హెర్క్యూలస్’ మిలిటరీ కార్గో విమానంలోనే ఈ 1 బిలియన్ డాలర్ల భారీ నగదును తరలించినట్లు పేర్కొంది. అయితే ఈ నగదు తరలింపు అంశాన్ని గానీ, భారీ ఆఫర్‌ను గానీ సౌదీ అరేబియా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ భారీ డీల్ కనుక వర్కవుట్ అయితే గల్ఫ్ రీజియన్‌లో ఆయిల్ రవాణా మరింత ఊపందుకోనుంది.









