
-RAVI PRAKASH
E20 Petrol In India : ఈ20 పెట్రోల్‌పై రాయిటర్స్ చేసిన ఇన్వెస్టిగేషన్ గురించి గత ఆర్టికల్‌లో చర్చించాం. మారుతి, టాటా మోటార్స్, మహీంద్రా వంటి ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పటికే 250కి పైగా ఫ్యూయల్ శాంపిల్స్ పరీక్షించాయి. ఆ పరీక్షల్లో వెల్లడైన ఫలితాల ఆధారంగా క్లోరైడ్, మాయిశ్చర్ కారణంగా ఫ్యూయల్ కంటామినేషన్ జరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు ఈ20 కథలో మరో బిగ్ ట్విస్ట్ వచ్చింది. ఎందుకంటే ఈసారి ఈ20పై ప్రశ్నలు వేస్తున్నది ఎవరో యాక్టివిస్ట్ కాదు. ప్రతిపక్ష నాయకుడు కాదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాదు. భారత ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి. అనంత నాగేశ్వరన్. అవును ఈ20పై ఇప్పుడు ప్రభుత్వానికి చెందిన కీలక ఆర్థిక సలహాదారే ఓ ముఖ్యమైన సజెషన్ ఇచ్చారు. తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితమైన ఆర్టికల్‌లో అనంత నాగేశ్వరన్, ఆకాష్ పూజారితో కలిసి ఈ సూచన చేశారు. పాత వాహనాల కోసం ఈ10 పెట్రోల్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలి. అవును ఈ10. ఇప్పుడు మన పెట్రోల్ పంపులలో దాదాపుగా కనిపించకుండా పోయిన ఆ లోయర్ ఎథనాల్ బ్లెండ్ పెట్రోల్. మరి ఈ10ని మళ్లీ ఎందుకు తీసుకురావాలి? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.
సీఈఏ ఆర్టికల్ ప్రకారం భారత్‌లో బీఎస్4కి ముందు తయారైన సుమారు 7.5 నుంచి 8 కోట్ల పాత టూవీలర్లు ఉన్నాయి. ఇదేదో చిన్న నంబర్ కాదు. ఇవన్నీ ఇప్పటి మోడర్న్ వాహనాల్లా ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో పనిచేయవు. చాలా వాహనాల్లో ఇప్పటికీ కార్బురేటర్ సిస్టమ్ ఉంది. ఇక్కడే ఈ20తో అసలు సమస్య మొదలవుతుందని ఆర్టికల్ చెబుతోంది. ఎందుకంటే ఈ20లో ఎథనాల్ శాతం ఎక్కువ. దీంతో ఫ్యూయల్లో ఆక్సిజన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ అదనపు ఆక్సిజన్‌కు తగ్గట్టుగా ఆధునిక ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ పనిచేసినంత సులభంగా పాత కార్బురేటర్ వాహనాలు అడ్జస్ట్ కాలేకపోవచ్చని సీఈఏ చెబుతున్నారు. ఇంతటితో సమస్య అయిపోలేదు. పాత వాహనాల్లో ఉండే రబ్బర్ సీల్స్ కూడా మరో సమస్య కావచ్చు. ఎందుకంటే అన్ని రబ్బర్ సీల్స్ ఎథనాల్‌కు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎథనాల్ ఉన్న ఇంధనాన్ని ఎక్కువకాలం ఉపయోగిస్తే సీల్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఆ నంబర్‌ను గుర్తు చేసుకోండి. ఏడున్నర నుంచి 8 కోట్ల వాహనాలు అంటే ఇది కొద్దిమంది వెహికల్ ఓనర్ల సమస్య కాదు. కోట్లాది వాహనాలపై ప్రభావం చూపించే విషయం.
ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం బయటకు వస్తోంది. ఆర్టికల్ ప్రకారం భారత్ రూపొందించిన అసలు ఎథనాల్ రోడ్‌మ్యాప్‌లో పాత వాహనాల కోసం తక్కువ ఎథనాల్ ఉన్న పెట్రోల్ అందుబాటులో ఉంచాలని ముందే భావించారు. అంటే పాత వాహనాలకు ఈ10 కొత్త వాహనాలకు ఈ20 ఇలా రెండు ఆప్షన్లు ఉండేలా ప్లాన్ చేశారు. కానీ ఆ ఈ10 ఆప్షన్ క్రమంగా పెట్రోల్ పంపుల నుంచి మాయమైపోయింది. అందుకే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారు? ఈ10ను మళ్లీ తీసుకురావాలి. ఈ20తో పాటు ఈ10 కూడా అందుబాటులో ఉంచండి. కానీ ఇంతటితో ఆ సజెషన్ ఆగలేదు. ఇంకో బిగ్ రికమండేషన్ కూడా ఇచ్చారు. ఈ20 దగ్గరే ఆపేయండి. అంటే ఎథనాల్ శాతాన్ని ఇకపై మరింత పెంచుకుంటూ పోవద్దన్న మాట. ఎందుకు? ఎందుకంటే వాళ్ల అభిప్రాయం ప్రకారం ఈ20 డిబేట్ కేవలం వెహికల్ ఇంజన్ల ఇష్యూ కాదు. దీని వెనుక దేశం మొత్తాన్ని ప్రభావితం చేసే మరో పెద్ద ప్రశ్న ఉంది. ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్. అంటే పంటలు ఆహారం కోసం ఉపయోగించాలా? లేక ఇంధనం కోసం ఉపయోగించాలా? ఇదే ఇప్పుడు అసలు డిబేట్. అందుకే ఈ20 కథ కేవలం పెట్రోల్-ఇంజిన్ కథ కాదు. ఇది వెహికల్స్, ఫార్మర్స్, ఫుడ్, ఆయిల్ అన్నింటినీ కలిపే పెద్ద చర్చ ఇది. ఇక్కడి నుంచే ఈ20 స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతోంది.
Also Read : యూట్యూబ్‌లో కీలక మార్పు.. తొలి ఫ్రేమ్ నుంచే వ్యూస్ లెక్కింపు
ఇప్పుడు ఈ20పై ఉన్న అతి పెద్ద వివాదం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ20 వల్ల నిజంగానే కార్లు, వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయా? ఇదే ఇప్పుడు అందరి ముందున్న పెద్ద ప్రశ్న. అయితే తాజాగా వచ్చిన ఓ విశ్లేషణ ఈ విషయంలో కొంత క్లారిటీ ఇస్తోంది. అందులో చెప్పిన ప్రకారం ఈ20 వల్లే ఇంజిన్లు దెబ్బతింటున్నాయనే వాదనకు బలమైన ఆధారాలు లేవు. దీనికి అమెరికాలో జరిగిన కొన్ని టెస్టులను ఉదాహరణగా చూపించారు. అందులో ఓక్ రిడ్జ్ నేషనల్ లాబొరేటరీ చేసిన పరీక్షలు కూడా ఉన్నాయి. ఈ పరీక్షల్లో 86 వాహనాలను దాదాపు కోటి కిలోమీటర్లకు పైగా నడిపి చూశారు. ఈ20 వరకు ఉన్న ఎథనాల్ బ్లెండ్స్‌తో ఈ టెస్టులు నిర్వహించారు. అయితే ఈ20 కోసం ప్రత్యేకంగా తయారు చేయని వాహనాల్లో కూడా అదనంగా ఇంజిన్ వేర్ కనిపించలేదని తేలింది. భారత్‌లో కూడా ఏఆర్ఏఐ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కలిసి చేసిన టెస్టుల్లో ఇదే తరహా ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. అంటే ఇక్కడ ఓ ఇంపార్టెంట్ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఈ20 ఈజ్ నాట్ ది సేమ్ యాజ్ కంటామినేటెడ్ ఈ20. అంటే మంచి క్వాలిటీతో తయారు చేసిన ఈ20 ఒకటి కలుషితమైన ఈ20 మరోటి. ఈ రెండింటినీ ఒకటిగా చూడకూడదు.
ఇది ఎందుకు ముఖ్యమంటే మొన్న మనం చెప్పుకున్న రాయిటర్స్ ఇన్వెస్టిగేషన్లో ఫ్యూయల్ శాంపిల్స్‌లో క్లోరైడ్, మాయిశ్చర్ పొల్యూట్ అయ్యే అవకాశాలపై పరిశ్రమ వర్గాల్లో ఆందోళన ఉందని వెల్లడించింది. అది వేరే విషయం. ఒకటి సరిగ్గా తయారు చేసిన ఈ20 వల్ల ఇంజిన్‌కు నష్టం జరుగుతుందా? రెండోది పెట్రోల్ తయారీ నుంచి పంప్ వరకు ఫ్యూయల్ క్వాలిటీ సరిగ్గా మెయింటేన్ అవుతోందా? ఇవి రెండూ వేర్వేరు ప్రశ్నలు. అందుకే ఈ20 విషయంలో మనం టూ డిఫరెంట్ డిబేట్స్‌ను చూస్తున్నాం. నంబర్ వన్ సరిగ్గా తయారు చేసిన ఈ20 కొత్త వాహనాలకు సేఫేనా? నంబర్ టూ ఫ్యూయల్ సప్లై చైన్‌లో క్వాలిటీ సరిగ్గా మెయింటేన్ అవుతోందా? ఈ రెండు విషయాలను మిక్స్ చేయకూడదు. కానీ ఈ విశ్లేషణ ఒక రియల్ ఇష్యూని వేలెత్తి చూపిస్తోంది. అదే ఓల్డ్ వెహికల్స్. భారత్‌లో బిఎస్4కి ముందు తయారైన సుమారు ఏడున్నర నుంచి 8 కోట్ల పాత టూవీలర్లు ఉన్నాయని అంచనా. వీటిలో చాలా వాహనాల్లో ఇప్పటికీ కార్బురేటర్ సిస్టమ్ ఉంది. ఇక్కడే ఈ20తో టెక్నికల్ ప్రాబ్లమ్ రావచ్చు. ఎందుకంటే ఈ20లో ఎథనాల్ ఎక్కువ. దాంతో ఫ్యూయల్లో ఆక్సిజన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ పెరిగినప్పుడు ఆధునిక ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోగలదు. కానీ పాత కార్బురేటర్ సిస్టమ్ అంత ఈజీగా అడ్జస్ట్ కాలేదు. దీంతో ఇంజిన్ ఎక్కువగా వేడెక్కే అవకాశం ఉంటుంది. ఇక మరో సమస్య రబ్బర్ సీల్స్. పాత వాహనాల్లో ఉన్న రబ్బర్ సీల్స్ ఎథనాల్‌కు తట్టుకునేలా తయారు చేసి ఉండకపోవచ్చు. ఎథనాల్‌కు ఎక్కువకాలం ఎక్స్పోజ్ అయితే అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. సీల్స్ మార్చడం పెద్ద ఖర్చు కాకపోవచ్చు. కానీ ఏడున్నర నుంచి 8 కోట్ల వాహనాల్లో వాటిని మార్చాలంటే? అది చిన్న విషయం కాదు. దీనికి ఏళ్లు పట్టొచ్చు.
ఇక్కడే అసలు క్రూషియల్ పాయింట్ వస్తుంది. భారత్ రూపొందించిన ఎథనాల్ రోడ్‌మ్యాప్‌లో పాత వాహనాల కోసం తక్కువ ఎథనాల్ ఉన్న పెట్రోల్ అందుబాటులో ఉండేలా ముందే ప్లాన్ చేశారు. అంటే పాత వాహనాలకు ఈ10. కొత్త వాహనాలకు ఈ20. ఇలా రెండు ఆప్షన్లు ఉండాల్సి ఉంది. కానీ ఆ ఈ10 ఆప్షన్ క్రమంగా పెట్రోల్ పంపుల నుంచి మాయమైపోయిందని తాజా ఆర్టికల్ చెబుతోంది. అందుకే సజెషన్ చాలా సింపుల్. బ్రింగ్ బ్యాక్ ఈ10. ఈ20తో పాటు ఈ10ను కూడా అందుబాటులో ఉంచండి. పాత వాహనాలు ఈ10 వాడుకోవచ్చు. ఈ20కి అనుకూలమైన కొత్త వాహనాలు ఈ20 వాడుకోవచ్చు. దీంతో పాత వాహనాలకు కూడా ట్రాన్సిషన్ కోసం టైమ్ దొరుకుతుంది. కానీ ఇక్కడ మరో పెద్ద ప్రశ్న వస్తోంది. వై షుడ్ ఇండియా గో బియాండ్ ఈ20? అంటే ఈ20 నుంచి ఈ27 లేదా ఈ30కి ఎందుకు వెళ్లాలి? ఎథనాల్ శాతాన్ని ఇంకా పెంచే ముందు దాని వల్ల దేశానికి వచ్చే మొత్తం లాభం, మొత్తం ఖర్చు లెక్కించామా? ఇదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఈ20 దాటిన తర్వాత ఇది కేవలం మీ కారు సమస్య కాదు. దీని ప్రభావం దేశం మొత్తంపై పడే అవకాశం ఉంది. అదే ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్. అంటే పంటలు ఆహారం కోసం ఉపయోగించాలా? లేక ఇంధనం కోసం ఉపయోగించాలా? ఇదే ఇప్పుడు ఈ20పై అసలు బిగ్ డిబేట్. ఇక్కడి నుంచే ఈ20 కథ మరింత సీరియస్‌గా మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది.
ఇప్పుడు చెప్పబోయేది ఈ20 మొత్తం డిబేట్లోనూ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కావచ్చు. అదే ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్. ఎందుకంటే భారత్ కేవలం పెట్రోల్‌లో ఎథనాల్ కలపడం మాత్రమే చేయడం లేదు. ఆ ఎథనాల్ తయారీ కోసం వ్యవసాయ భూమి, పంటలు, నీటిని కూడా ఎక్కువగా ఉపయోగిస్తోంది. ఇక్కడే లాంగ్ టర్మ్‌లో అసలు ప్రశ్న మొదలవుతోంది. ఒక్కసారి ఆలోచించండి భారత్ రెండు రకాల ఇంపోర్ట్ బిల్స్ తగ్గించుకోవాలని చూస్తోంది. ఒకటి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్. ఏడాదికి దాదాపు 11 నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు. రెండోది ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్. అంటే వంట నూనెల కోసం మనం విదేశాలపై ఆధారపడుతున్న ఖర్చు. ఇది ఏడాదికి సుమారు 1.6 నుంచి 1.75 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ20 వల్ల క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్లో తగ్గుదల కేవలం 3 నుంచి 4 శాతం మాత్రమే ఉండొచ్చని ఈ విశ్లేషణలో చెబుతున్నారు. అంటే చమురు దిగుమతుల ఖర్చు తగ్గించుకోవడానికి ఇంత పెద్ద స్థాయిలో వ్యవసాయ వనరులను ఎథనాల్ వైపు మళ్లించడం ఎంతవరకు కరెక్ట్? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.
ఇక ఎథనాల్ తయారీలో ఉపయోగించే ఫీడ్‌స్టాక్ పై ఒకసారి చర్చిద్దాం. మేజ్. మొక్కజొన్న. ప్రస్తుతం భారత్‌లో తయారయ్యే ఎథనాల్‌లో దాదాపు సగం మొక్కజొన్న నుంచే వస్తోందని ఈ విశ్లేషణ చెబుతోంది. అంతేకాదు మొత్తం ఎథనాల్ ఫీడ్స్టాక్లో ధాన్యాల వాటా దాదాపు 67 శాతంగా ఉందంటోంది. కానీ మొక్కజొన్న పండించాలంటే భూమి కావాలి. అదే భూమిలో సోయాబీన్ పండించొచ్చు. వేరుశెనగ పండించొచ్చు. ఆవాళ్లు పండించొచ్చు. అంటే ఒకే భూమి కోసం రెండు అవసరాలు పోటీ పడుతున్నాయి. ఫుడ్ ఆర్ ఫ్యూయల్? ఆహారమా? ఇంధనమా? ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. ఎథనాల్ తయారీ సంస్థలు మొక్కజొన్నకు గ్యారంటీడ్ ప్రైస్ ఇస్తే రైతులు మొక్కజొన్న వైపు ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంటుంది. అలా జరిగితే ఆయిల్ సీడ్ పంటల సాగుపై ఒత్తిడి పడొచ్చని ఈ విశ్లేషణ చెబుతోంది. అంటే సోయాబీన్ సోయాబీన్ వేరుశెనగ ఆవాళ్లు ఇలాంటి పంటల సాగు తగ్గే అవకాశం ఉంది. ఇక్కడితో సమస్య ముగిసిపోదు. మరో సెకండ్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఎథనాల్ తయారైన తర్వాత మిగిలే ధాన్యాన్ని యానిమల్ ఫీడ్‌గా ఉపయోగిస్తారు. దీంతో సోయాబీన్ నుంచి వచ్చే సోయా మీల్ ధరపై కూడా ప్రభావం పడొచ్చు. అంటే ఈ లెక్కల ప్రకారం చూస్తే ఆయిల్ సీడ్ రైతుకు రెండు వైపులా నష్టం వచ్చే అవకాశం ఉంది.
కానీ ఇది కేవలం ల్యాండ్ సమస్య మాత్రమే కాదు. ఇంకో పెద్ద విషయం ఉంది. వాటర్. ఎథనాల్ గురించి మాట్లాడేటప్పుడు మనం దాదాపుగా మాట్లాడని విషయం ఇది. వాటర్. ఇక్కడ నీటిని రెండు రకాలుగా చూస్తున్నారు. ఒకటి గ్రీన్ వాటర్. అంటే వర్షం ద్వారా వచ్చే నీరు. రెండోది బ్లూ వాటర్. అంటే నదులు, కాలువలు, బోర్‌వెల్స్, బావుల నుంచి వచ్చే నీరు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో చెరకు సాగు ఇప్పటికే నీటి వనరులపై ఒత్తిడి పెంచుతోంది. అందుకే ఎథనాల్ పాలసీలో బ్లూ వాటర్ కన్సప్షన్పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇక మరో పెద్ద ప్రశ్న క్లైమేట్ బెనిఫిట్. ఎథనాల్ అంటే పర్యావరణానికి మంచిదని మనం తరచూ వింటుంటాం. కానీ ఈ20 దాటిన తర్వాత వచ్చే క్లైమేట్ బెనిఫిట్‌పై ఇంకా పూర్తి క్లారిటీ లేదని ఈ విశ్లేషణ చెబుతోంది. ఎందుకంటే ధాన్యాల సాగు నుంచి ఎథనాల్ తయారీ వరకు కల్టివేషన్ ప్రాసెసింగ్ ఇతర ఇన్పుట్స్ అన్నింటినీ కలిపి చూస్తే మొత్తం లైఫ్ సైకిల్ ఇంపాక్ట్‌ను కూడా లెక్కించాల్సి ఉంటుంది. ఇక్కడ ఓ విషయం క్లియర్‌గా చెప్పాలి. నా అనాలసిస్ భారత్ ఎథనాల్ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిందని చెప్పడం లేదు. ఎథనాల్ ప్రోగ్రామ్ వల్ల చెరకు రైతులకు రావాల్సిన బకాయిలు చెల్లించడంలో ఉపయోగపడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయానికి సపోర్ట్ వచ్చింది. ఎథనాల్‌కు గ్యారంటీడ్ మార్కెట్ ఏర్పడింది. చక్కెర మిగులు నిల్వలను కూడా తగ్గించడంలో ఉపయోగపడింది. అంటే పాలసీకి బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ప్రతి పాలసీకి కాస్ట్స్ కూడా ఉంటాయి. అందుకే అసలు ప్రశ్న హావ్ వి క్యాలిక్యులేటెడ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఈక్వేషన్? అంటే లాభం ఎంత? ఖర్చు ఎంత? ఇవి రెండింటినీ పూర్తిగా లెక్కించామా? ఎందుకంటే ఒక్కసారి డిస్టిలరీలు నిర్మించాం. రైతులు పంటల సాగు ప్యాటర్న్ మార్చారు. భూమి, నీటిని ఇంధన ఉత్పత్తికి కేటాయించాం. ఆ తర్వాత వెనక్కి రావడం అంత ఈజీ కాదు.
అందుకే అనంత నాగేశ్వరన్, ఆకాష్ పూజారి ఇచ్చిన సూచనలు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాయి. పాత వాహనాల కోసం ఈ10ను మళ్లీ తీసుకురావాలి. మొక్కజొన్న వైపు ఎక్కువ భూమి వెళ్లేలా చేస్తున్న ఇన్సెంటివ్స్ను రివ్యూ చేయాలి. ఎడిబుల్ ఆయిల్ పాలసీని మరోసారి పరిశీలించాలి. అన్నింటికంటే ముఖ్యంగా హోల్డ్ అట్ ఈ20. ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ మధ్య ఉన్న పూర్తి లెక్కను అర్థం చేసుకునే వరకు ఈ20 దాటి ముందుకు వెళ్లకూడదన్నది సజెషన్. అదే బహుశా ఈ మొత్తం విశ్లేషణలో మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్. ఎందుకంటే ఈ20 డిబేట్ కేవలం మీ కారు గురించి కాదు. మీ ఫ్యూయల్ బిల్ గురించి కూడా. రైతు గురించి కూడా. ఆహార ధరల గురించి కూడా. నీటి గురించి కూడా. ఎనర్జీ సెక్యూరిటీ గురించి కూడా. చివరికి భారత్ ఏం పండించాలి అనే ప్రశ్న కూడా. ఫుడ్ ఫర్ ఇట్స్ పీపుల్ లేదా ఫ్యూయల్ ఫర్ ఇట్స్ వెహికల్స్? ఇప్పుడు గత రెండు రోజులుగా మనం మాట్లాడుకున్న మొత్తం విషయాన్ని ఒక్కసారి కలిపి చూస్తే ప్రశ్న ఇక “ఈ20 గుడ్ ఆర్ బ్యాడ్?” అని కాదు. అసలు ప్రశ్న “ఈ20 దాటి వెళ్లే ముందు మనం అన్ని లెక్కలు సరిగ్గా వేసుకున్నామా?” ఎందుకంటే కొన్ని పాలసీ నిర్ణయాలను రేపు మార్చేయొచ్చు. కానీ ఒక్కసారి భూమిని ఒక పంట నుంచి మరో పంట వైపు మళ్లిస్తే నీటిని ఇంధన ఉత్పత్తికి కేటాయిస్తే పంటల సాగు విధానం మారితే ఒక మొత్తం ఇండస్ట్రీని ఒక దిశలోకి తీసుకెళ్తే వెనక్కి రావడం అంత ఈజీ కాదు. అది స్లోగా ఉండొచ్చు. కాస్ట్లీగా ఉండొచ్చు. చివరికి పెయిన్‌ఫుల్‌గా కూడా మారొచ్చు.
ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాలన్నింటినీ చూస్తే ఒక విషయం మాత్రం క్లియర్. ది ఈ20 డిబేట్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్. అంటే ఈ20పై అసలు డిబేట్ ఇంకా క్లోజ్ కాలేదు. నిన్న రాయిటర్స్ ఇన్వెస్టిగేషన్ ఫ్యూయల్లో కంటామినేషన్ మారుతి, టాటా మోటార్స్, మహీంద్రాలో ఉన్న ఇంటర్నల్ కన్సర్న్స్పై ప్రశ్నలు లేవనెత్తింది. కానీ ఈరోజు భారత ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కథనం మరో ముఖ్యమైన ప్రశ్నను మన ముందుకు తీసుకొచ్చింది. ఈ20 దాటి వెళ్లే ముందు దాని పూర్తి ఖర్చును మనం అర్థం చేసుకున్నామా? ఇక కోట్లాది పాత వాహనాల విషయంలో సజెషన్ చాలా సింపుల్. బ్రింగ్ బ్యాక్ ఈ10. అంటే ఈ20తో పాటు ఈ10ను కూడా అందుబాటులో ఉంచాలి. ఇక దేశం ప్రయోజనాల విషయానికి వస్తే పాజ్. చెక్ ది డేటా. క్యాలిక్యులేట్ ది కాస్ట్. అంటే కొంచెం ఆగాలి. డేటాను పూర్తిగా పరిశీలించాలి. లాభం ఎంత? ఖర్చు ఎంత? లెక్కించాలి. ఎందుకంటే ఈ డిబేట్ కేవలం పెట్రోల్ గురించి కాదు. ఇది కార్ల గురించి. బైక్స్ గురించి. రైతుల గురించి. ఆహారం గురించి. నీటి గురించి. వినియోగదారుల గురించి. అన్నింటికంటే ఇండియాస్ ఎనర్జీ ఫ్యూచర్ గురించి. అందుకే ఈ20 నుంచి ఈ27 లేదా ఈ30 వైపు వెళ్లే ముందు మనం ముందుగా ఓ సింపుల్ ప్రశ్నకు సమాధానం వెతకాలి. హావ్ వి గాట్ ఈ20 రైట్? అంటే ఈ20 విషయంలో మనం అన్ని లెక్కలు సరిగ్గా వేసుకున్నామా? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి భారత్‌లో పంటలు పండించే విధానం మారితే నీటిని ఉపయోగించే విధానం మారితే వాహనాలకు ఇంధనం అందించే విధానం మారితే టర్నింగ్ బ్యాక్ మే నాట్ బి ఈజీ. వెనక్కి రావడం అంత ఈజీ కాకపోవచ్చు. అందుకే ఈ డిబేట్లో కావాల్సింది ఫ్యాక్ట్స్, నాట్ స్లోగన్స్. నినాదాలు కాదు నిజాలు కావాలి. భావోద్వేగాలు కాదు డేటా కావాలి. ఈ20 మంచి పాలసీనా? చెడ్డ పాలసీనా? అనే దానికంటే ఇండియా ఈ మార్గంలో వెళ్లేముందు అన్ని లెక్కలు సరిగ్గా వేసుకుందా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.
Also Read : ఆటో డ్రైవర్ ఇంట్లో సంచుల కొద్దీ డబ్బులు… ఐదుగంటలు లెక్కించగా తేలిందేంటంటే?









