
YouTube Views : యూట్యూబర్లకు గుడ్ న్యూస్..ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్ తన వ్యూ కౌంట్ విధానంలో కీలక మార్పు తీసుకురాబోతుంది. యూట్యూబ్‌లో ప్రస్తుతం ఉన్న లాంగ్ ఫార్మాట్ వీడియోలను ఎవరైనా 30 సెకన్లు పాటు వీక్షిస్తేనే వ్యూగా లెక్కించేవారు. అయితే ప్రస్తుత విధానంలో వీడియో ప్రారంభమైన తొలి ఫ్రేమ్ నుంచే వీడియో వ్యూ లెక్కింపు ప్రారంభం కానుంది. యూ ట్యూబ్ లోని అన్ని ఫార్మాట్లకు వ్యూస్ లెక్కింపు విధానంలో ఒకే విధానం ఉండాలన్న ఉద్దేశంతో యూ ట్యూబ్ ఈ మార్పు తీసుకు వస్తోంది. ఆగస్టు 24 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Also Read : పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్… పెరగనున్న కోల్గేట్ ధరలు?
కాగా, ఈ కొత్త విధానం యూట్యూబ్ షార్ట్స్, లైవ్ స్ట్రీమ్స్, సింపుల్ లాంగ్-ఫార్మాట్ వీడియోలు తదితర ఫార్మాట్లన్నింటికి వర్తించనుంది. గతంలోనే షార్ట్స్‌కు మాత్రమే అమల్లోకి వచ్చిన ఈ విధానాన్ని ఇప్పుడు అన్ని రకాల వీడియోలకు వర్తింపజేయనున్నట్లు యూట్యూబ్ టీం ప్రకటించింది. దీంతో టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తరహాలోనే యూట్యూబ్‌లోనూ వ్యూస్ నమోదు అవుతాయి. అంటే వీడియో ప్లే అయిన వెంటనే, లేదా ఎవరైనా లైవ్‌స్ట్రీమ్‌లోకి ప్రవేశించిన వెంటనే పబ్లిక్ వ్యూ నమోదవుతుందన్న మాట. అలాగే వీడియోను నిజంగా ఎంతమంది ఎక్కువ సేపు చూశారో తెలుసుకోవడానికి యూట్యూబ్ అనలిటిక్స్ లో ‘ఎంగేజ్డ్ వ్యూస్’ అనే ప్రత్యేక ఆప్షన్‌ను కూడా అందుబాటులో తీసుకు రానున్నారు. దీని వల్ల నిజంగా తమ కంటెంట్‌ను ఎంతమంది చూస్తున్నారో క్రియెటర్లు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది.
అయితే, కొత్తగా చేసిన ఈ మార్పు వల్ల ఆదాయం, మానిటైజేషన్‌పై ఎలాంటి ప్రభావం ఉండబోదని యూట్యూబ్ స్పష్టంచేసింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌ను అనుసరించే చెల్లింపులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టంచేసింది. ఈ మార్పు వల్ల యూజర్లకు వచ్చే ప్రయోజనం ఏమీ లేనప్పటికీ.. క్రియేటర్లకు మాత్రం ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. పబ్లిక్ వ్యూ కౌంట్ లో వీడియో ప్లే అయిన ప్రతిసారి వ్యూ నమోదు కావడం వల్ల వీక్షకులకు వీడియోల వ్యూస్ సంఖ్య గణనీయంగా పెరిగినట్లుగా కనిపించనుంది. వీక్షకుల వాచ్ టైమ్, ఎంగేజ్మెంట్ ఆధారంగా పాత పద్ధతిలోనే ఆదాయాన్ని లెక్కిస్తారని యూట్యూబ్ తేల్చి చెప్పింది.
Also Read : నేడు ఈ రాశులకు బిగ్ అలర్ట్.. ఈ జాగ్రత్త పాటించకపోతే సమస్యలు తప్పవు









