
ఎర్రసముద్రం, బాబ్-ఎల్-మండేబ్ జలసంధి ప్రాంతంలో యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారులు మళ్లీ దాడులను ప్రారంభించాయి. ఇటీవల సౌదీ అరేబియా తన రక్షణ కవచాన్ని బలోపేతం చేసుకోవడానికి పాకిస్తాన్, తుర్కియేలతో కలిసి ఒక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందం జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఎర్రసముద్రంలో సౌదీకి చెందిన సైనిక పడవలు, చమురు ట్యాంకర్లపై హూతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసి తీవ్ర నష్టం కలిగించారు.
ఈ ఘటనలతో సౌదీకి భద్రత కల్పిస్తామన్న పాకిస్తాన్, తుర్కియేల రక్షణ ఒప్పందం ఏమైందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న సౌదీకి చెందిన నావికా దళ పడవలు, చమురు నౌకలే లక్ష్యంగా హూతీలు దాడులు సాగించారు. నౌకాదళ దిగ్బంధనాన్ని ధిక్కరించి ప్రయాణిస్తున్నందుకే వీటిని ధ్వంసం చేశామని హూతీ దళాలు ప్రకటించాయి. ఈ దాడులలో అనేక మిలిటరీ బోట్లు దెబ్బతినడమే కాకుండా భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ చర్యలతో ఎర్రసముద్రంలో అంతర్జాతీయ నౌకా రవాణా మళ్లీ తీవ్ర ముప్పులో పడింది.
Also Read : మాజీ లవర్ మర్డర్‌కు ప్లాన్.. ఏఐ చాట్‌బాట్‌తో చాటింగ్.. ఎఫ్‌బీఐకి పట్టించిన చాట్‌జీపీటీ!
సౌదీ అరేబియాపై ఎలాంటి దాడి జరిగినా కలిసికట్టుగా ప్రతిఘటిస్తామని పాకిస్తాన్, తుర్కియేలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇస్లామిక్ నాటో మాదిరిగా ఉన్న ఈ రక్షణ కూటమి, హూతీలు సౌదీకి చెందిన లక్ష్యాలపై విరుచుకుపడినప్పుడు మాత్రం తగిన రీతిలో స్పందించలేకపోయింది. ప్రత్యక్షంగా సైనిక రక్షణ కల్పించడంలో ఈ దేశాల దళాలు విఫలమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందం కాగితాలకే పరిమితమైందని క్షేత్రస్థాయిలో హూతీల క్షిపణి దాడుల ముందు నిలబడలేకపోయింది.
ఎర్రసముద్రం ప్రపంచ చమురు, వాణిజ్య రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడ హూతీలు నిరంతరం జరుపుతున్న దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు పశ్చిమాసియాలో భద్రతా సంక్షోభాన్ని మరింత పెంచుతున్నాయి. సౌదీ అరేబియా ఎంతటి ఆధునిక ఆయుధాలు, విదేశీ రక్షణ ఒప్పందాలు ఉన్నప్పటికీ హూతీల డ్రోన్, క్షిపణి సాంకేతికత ముందు తన తీర ప్రాంతాలను సంపూర్ణంగా కాపాడుకోవడం కష్టంగా మారింది. సౌదీ రక్షణ కోసం పాకిస్తాన్, తుర్కియే చేసిన వ్యాపార, సైనిక హామీలు క్షేత్రస్థాయిలో నిలబడలేవని ఈ దాడులతో స్పష్టమైంది.
Also Read : 17 సార్లు లేట్.. మనిషిని ఉద్యోగం నుంచి తీసేసిన AI!









