Samantha : ఇటీవలే మా ఇంటి బంగారం చిత్రంతో హిట్‌ కొట్టిన నటి సమంత మరోసారి తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. తను నటించిన మా ఇంటి బంగారం చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయడం గమనార్హం. ఇదంతా ఒకెత్తయితే ఆమె గర్భం దాల్చడంతో ఆమె ఆనందానికి అవుధులు లేవు. జీవితంలో తొలిసారి తల్లికాబోతుండటంతో ఆమె ఆ ఆనందాన్నిఆస్వాదిస్తున్నారు. ఇర ఈ క్రమంలోనే ప్రస్తుతం సినిమాలకు దూరంగా రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ ఈ మధ్యలోనే సమంత కొత్త అవతారం ఎత్తారు. ఓ టెలివిజన్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె డిజిటల్ వేదికపైకి వస్తున్నారు.

Also Read : నా వీడియోలు కూడా చూడకండి.. ఆస్పత్రి పాలైన షకీలా!

 

View this post on Instagram

 

A post shared by @sony.vizha

గతంలోనే తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమైన సామ్ జామ్ షోకు సమంత హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి అలరించారు. అలాగే స్టార్ మాలో ప్రసారమయ్యే మెగా రియాలిటీ షో బిగ్‌బాస్‌కు గెస్ట్‌గా వచ్చి హోస్టింగ్ కూడా చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక ‘సోనీలివ్ తమిళం’లో ఆమె షో చేయడానికి అంగీకరించారు. ‘సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ తమిళ్’ (Celebrity MasterChef Tamil) రియాలిటీ షోకి సమంత హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా శనివారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం విశేషం. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను కూడా వారు ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశారు. బనిజయ్ ఏషియా నిర్మిస్తోన్న ఈ షో ఎప్పుడు ప్రసారమయ్యేది ఇంకా ప్రకటించలేదు.

ఈ కుకింగ్‌ షోలో తమిళ సినీ, టీవీ ప్రముఖులు పాల్గొననున్నారు. కాగా సమంత తల్లి కానుండటంతో షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమలోనే పలువరు సినీ, టీవీ నటులు ఈ షో ద్వారా కిచెన్‌లో కఠినమైన కుకింగ్ ఛాలెంజ్‌లు, ఊహించని ట్విస్ట్‌లను ఎదుర్కోడానికి సిద్దమవుతున్నారు. ప్రేక్షకులను, జడ్జీలను మెప్పించే డిష్‌లను వండి టైటిల్ కోసం పోటీపడబోతున్నారు. ఈ షో గురించి సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. “ఇప్పటివరకు నేను ఇలాంటి షో చేయలేదు. అందుకే దీనికి ఓకే చెప్పా. సెలబ్రిటీల మరో కోణాన్ని ఇందులో చూడడానికి అవకాశం ఉంది. వాళ్లు రిస్క్ తీసుకోవడం, తప్పులు చేయడం, సర్ప్రైజ్ చేయడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది” అని వివరించారు.

Also Read : సీఎం విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. సంగీత సంచలనం!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.