
Delhi : ఢిల్లీలో ర్యాపిడో బైక్ ప్రయాణంలో ఒక యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆఫీసుకు వెళ్లడానికి ర్యాపిడో బైక్ ఎక్కిన ఆయేషా శ్రీవాస్తవ్ అనే యువతి, తన ప్రాణాలను కాపాడుకోవడానికి నడుస్తున్న బైక్ పైనుంచే కిందకు దూకేసింది. బైక్ డ్రైవర్ ఆమెను దారి మళ్లించి, ఎవరూ లేని నిర్మానుష్యమైన రోడ్డు వైపు తీసుకెళ్లడమే ఇందుకు కారణం. ఆ ప్రాంతం చూసి భయపడిన ఆయేషా, బైక్ ఆపమని ఎంత వేడుకున్నా ఆ డ్రైవర్ మాత్రం వినలేదు.
Also Read : భర్త ప్రైవేట్ పార్ట్స్ కు కరెంట్ షాక్.. ప్రియుడితో కలిసి భార్య దారుణం!
బైక్ ఆపకపోవడంతో భయపడిపోయిన ఆమె, డ్రైవర్‌ను వెనుక నుంచి కొట్టి ఆపే ప్రయత్నం చేసింది. కానీ అతడు ఆపకపోవడంతో వేరే దారి లేక వేగంగా వెళ్తున్న బైక్ పైనుంచే కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమె తల, చేతులు, కాళ్లకు గట్టి దెబ్బలు తగిలాయి. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాక, ఈ విషయంపై ర్యాపిడో కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసినా సరైన స్పందన రాలేదు. దీంతో ఆమె సోషల్ మీడియాలో తన గాయాల వీడియోను షేర్ చేస్తూ, మహిళల భద్రత గురించి ఆవేదన వ్యక్తం చేసింది. సదరు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ర్యాపిడో కంపెనీ వెంటనే మేల్కొంది. ఆ డ్రైవర్‌ను జాబ్ నుంచి శాశ్వతంగా తీసేసినట్లు ప్రకటించింది. అతడిపై కేసు పెట్టడానికి కావాల్సిన పూర్తి వివరాలను ఆయేషా ఇమెయిల్‌కు పంపించింది. ఆమెకు కావలసిన వైద్య ఖర్చులు, న్యాయపరమైన సాయం అందిస్తామని, పూర్తి అండగా ఉంటామని ర్యాపిడో సంస్థ తెలిపింది.
Also Read : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్యనే రూ. 12 లక్షలకు బేరం పెట్టాడు!









