
ఇరాన్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బుజ్జగిస్తోంది. ఏం కావాలంటే అదిస్తా..కానీ మమ్మల్ని మాత్రం టార్గెట్ చేయొద్దంటోంది. అమెరికాను మీ ఇష్టమొచ్చింది చేసుకో..బట్ తమ జోలికి రావొద్దని పబ్లిక్‌గానే రిక్వెస్ట్ చేస్తోంది. UAE ఇరాన్‌ను ఎందుకంత బతిమాలుతోంది.. అమెరికా, ఇరాన్ మధ్యలో అరబ్ కంట్రీస్ ఎందుకు ఎంటరయ్యాయి.
Also Read : ట్రంప్ బిగ్ స్కెచ్.. విదేశీ డ్రోన్లపై 100% పన్ను బాదుడు.. దీని వెనుక ఉన్న అసలు ప్లాన్ ఇదే!
BREAKING: UAE Unfroze and Returned Billions of Dollars in Iranian Bank Assets.
$3 billion transferred in June, plus 2 tonnes of Gold worth $283 million delivered in August.
REASON: To keep UAE from potentially safe from future attacks by Iran.
1- UAE Royal Jet Boeing 737-7KK… pic.twitter.com/eRBdapGfdq
— CryptoWala (@cryptowalax) August 13, 2026
అమెరికా బాంబులు వేస్తుంటే.. ఇరాన్ మిసెళ్లతో దూసుకెళ్తుంది. కానీ మధ్యలో UAE బలి అవుతుంది. ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు… మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల భయం… ఇలాంటి సిచ్యుయేషన్స్‌లో UAE నుంచి ఇరాన్ వైపు బిలియన్ల డాలర్ల Frozen Assets, Gold, Aircraft వెళ్తున్నాయన్న వార్తలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం ఇరాన్‌కు యూఏఈ రెండు టన్నుల వరకు బంగారం, అలాగే బిలియన్ల డాలర్ల నిధుల బదిలీ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో యూఏఈ బంగారాన్ని ఇరాన్‌కు ఇచ్చిందనే డౌట్ చాలా మందిలో మొదలవుతుంది. అయితే ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తుంది. ఇరాన్ ప్రతిదాడి చేస్తుంది. ఆ ప్రతిదాడి Gulfలోని అమెరికా మిత్రదేశాల వైపు మళ్లితే.. నెక్ట్స్ టార్గె్ట్ అవుతుందని యూఏఈ భయపడుతోంది. ఈ క్రమంలోనే తమకు శత్రువులు కాదని తెలుపుతూ యూఏఈ ఇచ్చింది.
Also Read : నేను హఫీజ్‌కు బానిసని.. ఉగ్రవాదులతో పాక్ మాజీ మంత్రి
UAE మొత్తం 10 బిలియన్ డాలర్ల వరకు ఇరాన్ నిధులను విడుదల చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అందులో 3 బిలియన్ డాలర్లకు పైగా అప్పటికే ఇరాన్‌కు చేరినట్లు సమాచారం. ఇప్పుడు తాజాగా 2 టన్నుల గోల్డ్ అంటే దాదాపు 283 మిలియన్ డాలర్ల విలువైన బంగారం అన్నమాట. ఇంతే కాకుండా 15 సెకండ్ హ్యాండ్ ప్యాసెంజర్ ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. దీనివల్ల ఇరాన్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గుతుంది. విమానయాన రంగానికి ఊపిరి వస్తుంది. దీంతో ట్రంప్‌కు తలనొప్పి మొదలైంది. ఒకవైపు ఇరాన్‌పై గరిష్ఠ ఒత్తిడి తెచ్చేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తుంటే.. మరోవైపు గల్ఫ్‌లో అమెరికాకు మిత్రదేశం యూఏఈ మాత్రం ఇరాన్‌తో ఆర్థిక బంధాలను కొనసాగిస్తోంది. అమెరికాతో మైత్రిని కాపాడుకుంటూనే ఇరాన్‌తో మనుగడ ఒప్పందం చేసుకుంటూ యూఏఈ ఒక దౌత్యపరమైన సంతులనాన్ని పాటిస్తోంది. యుద్ధం వల్ల తమ చమురు సరఫరా, రవాణా మార్గాలు, పెట్టుబడులు దెబ్బతిని గల్ఫ్ ఆర్థిక వ్యవస్థ కూలిపోకూడదనే ఉద్దేశంతోనే యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ఒప్పందంలో ఇరు దేశాలకు వేర్వేరు స్వార్థాలు ఉన్నాయి. యూఏఈకి తమ ప్రాంతంలో భద్రత కావాలి, అలాగే ఇరాన్‌కు అమెరికా ఆంక్షల నుంచి ఉపశమనం పొందడానికి ఆర్థిక సహాయం, నిధులు కావాలి. బాంబులు, క్షిపణులే కాకుండా డబ్బు, బంగారం, దౌత్యం కూడా యుద్ధంలో శక్తివంతమైన ఆయుధాలని యూఏఈ నిరూపిస్తోంది. తమ నేల యుద్ధభూమిగా మారకుండా ఉండేందుకు బంగారం, నిధులు ఇస్తూ ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అబుధాబి ఈ నిర్ణయం తీసుకుంద. అయితే ఇరాన్‌ను సులభంగా లొంగదీసుకోవడం సాధ్యం కాదని ట్రంప్‌కు స్పష్టంగా అర్థమైంది. గల్ఫ్ దేశాలు ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే పశ్చిమాసియాలో అసలైన రాజకీయం మొదలైందని నిపుణులు అంటున్నారు.









