
ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఇంధన కొరత బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడుతోంది. ఈ క్రమంలో కరెంట్‌ను ఆదా చేసేందుకు అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. షాపింగ్ మాల్స్, మార్కెట్లు, చిన్న దుకాణాల పనివేళలను తగ్గిస్తూ బంగ్లాదేశ్ విద్యుత్, ఇంధన, ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ ఆ దేశవ్యాప్తంగా కొత్త ఉత్తర్వులను జారీ చేసింది.
#Bangladesh is dimming its nights.
Malls, markets & shops must shut by 8 PM; billboards go dark by 7 PM amid a deepening energy crisis.
As Dhaka seeks more diesel, India could once again be the neighbour to the rescue.
Full story 👇https://t.co/XaZSdDJNla
— Anindya (@AninBanerjee) August 13, 2026
బంగ్లాదేశ్‌లోని అన్ని షాపింగ్ మాల్స్, మార్కెట్లు, వ్యాపారాలు ఇకపై ఉదయం 11:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలి. రాత్రి 8:00 గంటల తర్వాత ఎలాంటి దుకాణాలను నడపడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతకుముందు అమలులో ఉన్న నిబంధన ప్రకారం రాత్రి 9:00 గంటల వరకు సమయం ఉండేది. కానీ పెరుగుతున్న విద్యుత్ కొరత దృష్ట్యా ఈ కొత్త ఉత్తర్వులను తక్షణమే అమల్లోకి తీసుకొచ్చారు.
కేవలం వ్యాపార సమయాలనే కాకుండా విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు మరికొన్ని కఠిన ఆంక్షలను కూడా విధించారు. రోడ్లపై, షాపుల ముందు వెలిగే ప్రకటనల బోర్డులు, డెకరేటివ్ అలంకరణ లైట్లను సాయంత్రం 7:00 గంటలకల్లా పూర్తిగా ఆపివేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జిబిషన్లు, జాతరలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. అయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆసుపత్రులు, మెడికల్ షాపులు, హోటళ్లు, ఫుడ్ కోర్టులు, అత్యవసర సేవలకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చారు.
అయితే మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. యుద్ధం వల్ల గ్లోబల్ మార్కెట్లో ఇంధన సరఫరా నిలిచిపోయి విద్యుత్ ఉత్పత్తి భారంగా మారింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం ఆగే వరకు, ఇంధన సమస్య తీరే వరకు ఈ కొత్త రూల్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.









