
CM Chandrababu : రాజమండ్రి మెడికల్ స్టూడెంట్ ప్రియాంక ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నాతాధికారులను సీఎం ఆదేశించారు. మెడికల్ స్టూడెంట్స్ ప్రియాంక, ఉమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం. వారిద్దరూ తీవ్రంగా గాయపడడం బాధాకరమని సీఎం తెలిపారు. ఘటన జరిగిన తీరును చంద్రబాబుకు అధికారులు వివరించారు.
Also Read : నేషనల్ హ్యాండ్లూమ్ డే: ప్రధాని మోదీకి మంగళగిరి చేనేత వస్త్రం గిఫ్ట్!
మద్యం మత్తులో ఇద్దరు మెడికోలను కారుతో ఢీ కొట్టి నిందితులు పరారయ్యారని చంద్రబాబుకు తెలిపారు. నిందితులను అరెస్టు చేశామని సీఎంకు వెల్లడించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం వారిని ఆదేశించారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ వద్దన్నారు. ప్రియాంక పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అవసరమైన వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.
కాగా మద్యం మత్తులో ఉన్న యువకులు దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్ కారును నిర్లక్ష్యంగా నడుపుతూ బైకపై వెళ్తున్న వైద్య ప్రియాంక, ఉమేష్‌ను తీవ్రంగా ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటన 2026 ఆగస్టు 3న రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్యమాల్ గేటు వద్ద జరగగా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను ఓ స్థానిక ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆ తరువాత సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇక ఉమేష్ స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు.
Also Read : తిరుమలలో హార్దిక్ పాండ్యా కేశదానం: గుండు ఎందుకు చేయించుకుంటారు?.. కేశదానం వెనుక అసలు రహస్యం ఇదే..!









