
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ ఈరోజు థియేటర్స్ లో విడుదలైంది. కథ, కథనం రొటీన్ గా ఉన్నప్పటికీ జయకృష్ణ మాత్రం తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ లో బాగా పెర్ఫార్మ్ చేశాడని ప్రేక్షకులు చెబుతున్నారు. కొన్ని చోట్ల సూపర్ స్టార్ కృష్ణను గుర్తుచేశాడని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : 44 ఏళ్లకే అసలైన జీవితం మొదలవుతుంది…త్రిష
కృష్ణ సర్ప్రైజ్ ఎంట్రీ
అయితే ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ సర్ప్రైజ్ ఎంట్రీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఆయన వీడియో బైట్ ను ప్లే చేశారు. ఇందులో కృష్ణ తన మనవడికి ఆల్ ది బెస్ట్ చెబుతూ కనిపించారు. మహేష్ బాబును ఎలా ఆదరించారో.. జయకృష్ణను కూడా అంతే ప్రేమతో ఆదరించాలని అభిమానులను కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. కృష్ణ వీడియో రాగానే థియేటర్స్ అన్నీ అభిమానుల అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయాయి.
ST #SrinivasaMangapuram 🔥#GhattamaneniJaiKrishna 💥
Jai SuperStar @urstrulyMahesh ✊ pic.twitter.com/NX87ZZaJIO
— Mahesh🖤Kajal (@MaheshKajal3) July 30, 2026
Also Read : జీ5 భారీ అనౌన్స్‌మెంట్.. 7 భాషల్లో సరికొత్త కంటెంట్ లైనప్ విడుదల!









