Z5 Movies :  ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ప్రేక్షకులను అలరించేందుకు మరో అడుగు ముందుకు వేసింది. ట్రెండ్‌ను ఫాలో అవ్వడం కాకుండా, కొత్త ట్రెండ్స్ సృష్టిస్తూ వస్తున్న జీ5.. తాజాగా ఏకంగా 7 భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ మల్టీ-లాంగ్వేజ్ కంటెంట్ లైనప్‌ను ప్రకటించింది. తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు లైవ్ స్పోర్ట్స్, ఏఐ, ఆధారిత కథనాలు, యానిమేషన్, పిల్లల వినోద కార్యక్రమాలను అందించనున్నట్లు వెల్లడించింది.

Also Read : శోభితా పొలిటికల్ ఎంట్రీ.. మనసులో మాట బయటపెట్టిన అక్కినేని కోడలు..!

తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు జీ5 ఎంతో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లోకి తెచ్చింది. ఇందులో భాగంగానే ఎన్‌బీకే111, వెంకీ అనీల్ 5, వృషకర్మ వంటి భారీ చిత్రాలతో పాటు.. నివేథా థామస్ నటించిన శ్రీమతి, శ్రీకాంత్ నటించిన అబ్జెక్షన్ మై లార్డ్ వంటి కొత్త ఒరిజినల్స్ రానున్నాయి. అలాగే బ్లాక్‌బస్టర్ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా కూడా కొత్త సీజన్‌తో తిరిగి వస్తోంది.

హిందీలో కాంబ్లీ, ది స్కామ్ లీక్డ్, కాఫీ కింగ్, రంగ్‌బాజ్ ఎస్4, జనావార్ 2, హై జావాని తో ఇష్క్ హోనా హై, బండార్, కంగనా రనౌత్ భారత్ భాగ్య విధాత వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా ఫిఫా, బందెస్‌లిగా, ఐఎల్‌టీ20 (ILT20) వంటి గ్లోబల్ స్పోర్ట్స్ ప్రాపర్టీస్‌తో పాటు ఏఐ, యానిమేషన్ విభాగంలో విక్రమ్ బేతాల్, తిరుపతి బాలాజీ, రామ్ ఆంజనేయ యుద్ధ్ వంటి వినూత్న కంటెంట్‌ను కూడా తీసుకొస్తున్నారు. భారతదేశంలోని ప్రముఖ స్టూడియోలు, అగ్ర దర్శకులు, స్టార్స్‌తో కలిసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు జీ5 సిద్ధమవుతోంది.

Also Read : ‘‘హీరో నేనే.. హీరోయిన్ నేనే’’: లోకేష్ కొత్త మూవీలో బన్నీ ఊరమాస్ గెటప్..!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.