
-RAVI PRAKASH
దశాబ్దాలుగా…
Indian Mainstream Television Channels రాజకీయ నాయకులను ప్రశ్నించాయి!
అధికారులను నిలదీశాయి!
న్యాయవ్యవస్థను, పోలీసులను…
చివరికి ప్రతి ప్రభుత్వ వ్యవస్థను ఎండగట్టాయి!
కానీ…
ఈ మధ్యకాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి! ఒకప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆ మీడియాయే… ఈనాడు ప్రజా ఆగ్రహానికి గురవుతోంది!ఢిల్లీ Student Protestలో… ఆ ఆగ్రహజ్వాలలు కేవలం ప్రభుత్వంపై మాత్రమే వ్యక్తమవ్వలేదు.అవి నేరుగా Main Stream న్యూస్ ఛానెళ్లపై విరుచుకుపడ్డాయి! ఇందుకు సంబంధించిన అనేక షాకింగ్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని దృశ్యాల్లో… రిపోర్టర్లను చూసి నిరసనకారులు తీవ్రంగా అరుస్తున్నారు!
మరికొన్ని చోట్ల… విలేకరులను నేరుగా నిలదీసి కడిగిపారేస్తున్నారు! ఇవి మనం సాధారణంగా చూసే దృశ్యాలు కావు! ఎందుకంటే… వార్తలను ప్రపంచానికి తెలియజేయాల్సిన రిపోర్టర్లే, స్వయంగా వార్తల్లోకి ఎక్కినప్పుడు…మన ముందు ఒక మింగుడుపడని నిజం నిలబడుతోంది! అసలు మనం ఈ పరిస్థితికి ఎలా దిగజారాం? మీడియాపై ప్రజలు తమ నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారా? ఒకవేళ అదే నిజమైతే… ఎందుకు? ఈనాటి నా అనాలసిస్ ..మీడియాను వెనుకేసుకురావడానికి కాదు! అలా అని… మీడియాను బోనులో నిలబెట్టడానికీ కాదు!ఎక్కడో ఏసీ స్టూడియోల్లో కూర్చుని ఇచ్చే కవరేజ్ వల్ల… రోడ్లపై ఉన్న రిపోర్టర్లు ఎందుకు జనాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందో తెలుసుకునే ప్రయత్నం!
ముందుగా… ఈ మొదటి వీడియోను ఒక్కసారి చూడండి! ABP న్యూస్ రిపోర్టర్ లైవ్ కవరేజ్ ఇస్తుండగా…అక్కడున్న నిరసనకారులు ఒక్కసారిగా గోదీ మీడియా… హాయ్ హాయ్ నినాదాలతో హోరెత్తించారు.ఆ దృశ్యాలను గమనించండి!
ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే…అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?ప్రజలకు… మెయిన్ స్ట్రీమ్ టీవీ మీడియాకు మధ్య…ఇంత పెద్ద గ్యాప్ ఎందుకు వచ్చింది?ఇక ఇప్పుడు చూడబోయే రెండో వీడియో కూడా…జంతర్ మంతర్ నుంచి వచ్చిందే! అక్కడ ఒక టీవీ రిపోర్టర్…నిరసనకారుడిని నిలదీశారు. ఈ ఆందోళనలో… దేశవ్యతిరేక నినాదాలు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు! దానికి ఆ ఆందోళనకారుడు వెంటనే ఎదురుదాడికి దిగాడు..అసలు ఇందులో దేశవ్యతిరేక నినాదాలు ఎక్కడున్నాయి అని ప్రశ్నించాడు! దానికి ఆ రిపోర్టర్ ఇచ్చిన షాకింగ్ ఆన్సర్… ఇంక్విలాబ్ జిందాబాద్ లాంటి నినాదాలు! ఆ తర్వాత… వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది…ఇద్దరి మధ్య మాటల యుద్ధాన్ని ఒక్కసారి చూడండి…ఏది ఒప్పో… ఏది తప్పో… మీరే తేల్చండి!
NEXT వీడియో కూడా… సరిగ్గా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితికి అద్దంపడుతుంది. ఈసారి…మరో మహిళా రిపోర్టర్… జంతర్ మంతర్ దగ్గర లైవ్ కవరేజ్ ఇస్తున్నారు. ఆమె తన రిపోర్టింగ్ పూర్తిచేసే లోపే…అక్కడున్న ఆందోళనకారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు!గోదీ మీడియా… ముర్దాబాద్! అంటూ ఆందోళనతో హోరెత్తించారు! ఆ స్లోగన్స్ విని తట్టుకోలేక…ఆ రిపోర్టర్ అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది! ఆ షాకింగ్ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం…
Also Read : ఓ వైపు ఎల్‌నినో.. మరో వైపు వర్షాలు.. అసలేం జరుగుతోంది?
ఇక తర్వాత రాబోయే వీడియో కూడా…సరిగ్గా ఇలాంటి దృశ్యాలనే మన ముందుంచుతోంది.ఈసారి…మరో మహిళా రిపోర్టర్…Protesters ప్రవర్తిస్తున్న తీరుని ప్రశ్నించారు…కానీ… ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాకపోగా…చివరికి ఆమె అక్కడి ప్రజాగ్రహానికి గురయ్యారు…ఆ సమయంలో అక్కడ ఎంతటి Tension నెలకొందో… ఈ వీడియోలో మీరే చూడండి!
ఇక తర్వాతి వీడియోలు చూస్తే…అక్కడి సిచ్యువేషన్ ఎంత డేంజర్‌గా ఉందో అర్థమవుతుంది!ఈ విజువల్స్‌లో కనిపిస్తోంది… టైమ్స్ నౌ రిపోర్టర్ దేవ్ కొటక్! మొదటి వీడియోలో…కొందరు వ్యక్తులు ఆయనను ఆ ఆందోళన మధ్య బయటకు తీసుకెళ్తుంటే… రిపోర్టర్ కొటక్ భయంతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది! ఇక రెండో వీడియోలో…ఆ Protestలో తనపై అసలు ఏం జరిగిందో… దేవ్ కొటక్ స్వయంగా వెల్లడించారు! ఈ రెండు వీడియోలను ఒకదాని తర్వాత ఒకటి క్లియర్‌గా చూద్దాం…ఈ షాకింగ్ దృశ్యాలను… ఒక్కసారి Pin to Pin గమనించండి!
టైమ్స్ నౌ రిపోర్టర్ దేవ్ కొటక్‌పై జరిగిన దాడిని…కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు సర్వదాస్ ఖండించారు. అంతేకాదు, X వేదికగా సర్వదాస్ క్షమాపణలు చెప్పారు. ఇలాంటి దౌర్జన్యాన్ని తాము ఎంతమాత్రం సమర్థించబోమని స్పష్టం చేశారు. ఇక్కడ సర్వదాస్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్! ఎందుకంటే… ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలు నిజం ఒక్కటే! విధులు నిర్వర్తిస్తున్న ఏ రిపోర్టర్‌పైనా…దాడి చేయడం, బెదిరించడం లేదా అడ్డుకోవడాన్ని అస్సలు సమర్థించకూడదు! హింస ఎప్పటికీ పరిష్కారం కాదు!
కానీ… ఇక్కడే మనకు ఒక మింగుడుపడని నిజం కనబడుతుంది.అసలు మనం ఈ పరిస్థితికి ఎలా వచ్చాం?ఈనాడు వీధుల్లో కొందరు టీవీ రిపోర్టర్లను చూస్తే ప్రజలకు ‘నమ్మకం’ కలగడానికి బదులు… ‘ఆగ్రహం’ ఎందుకు వ్యక్తమవుతోంది?గత కొన్నేళ్లుగా జరిగిన…రైతుల పోరాటాలు…CAA-NRC ఆందోళనలు…ఇంకా అనేక ప్రజా ఉద్యమాల సమయంలో…కొన్ని టీవీ ఛానెల్స్, అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం మానేసి… ప్రభుత్వ మద్దతుకే మైక్ పడుతున్నాయనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఆ విమర్శలతో మీరు ఏకీభవించినా, ఏకీభవించకపోయినా… అలాంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉందనేది పచ్చి నిజం! మీడియా పట్ల ప్రజల్లో ఏర్పడే ఇలాంటి అభిప్రాయాలకు… పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
విచిత్రం ఏంటంటే… రిపోర్టర్ దేవ్ కొటక్‌పై దాడి జరిగిన టైమ్‌లో…టైమ్స్ నౌ ఛానెల్లో ఒక ఇంటర్వ్యూ టెలీకాస్ట్ అయింది. అందులో సినీ గేయ రచయిత మనోజ్ మంతషిర్, నిరసనకారులను ఏకంగా “యాంటీ నేషనల్స్” అని సంబోధించారు.మనోజ్ వ్యాఖ్యలపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండవచ్చు.కానీ… ఈ చర్చ ఒక్క ఇంటర్వ్యూకో, లేదా ఒక్క న్యూస్ ఛానెల్కో పరిమితమైంది కాదు!ఇక్కడున్న అసలు సమస్య – ప్రజల నమ్మకం! జర్నలిజం అనేది అధికారాన్ని నిలదీయాలి! కానీ… అదే జర్నలిజం అధికారానికి మోకరిల్లితే … ప్రజలు ఆ వ్యవస్థనే అసహ్యించుకునే ప్రమాదం ఉంటుంది.
అది మీడియాకే కాదు… ఈ ప్రజాస్వామ్యానికే అత్యంత ప్రమాదకరం!మీడియాను ప్రజాస్వామ్యానికి Fourth Piller అని పిలుస్తుంటాం.దాని అసలు బలం స్టూడియోల్లోనో, TRP రేటింగుల్లోనో లేదు! మీడియాకు ఉన్న ఏకైక అతిపెద్ద బలం… ప్రజల నమ్మకమే!వారిలో ఆ నమ్మకమే పోతే, నష్టపోయేది కేవలం మీడియా మాత్రమే కాదు… ప్రజాస్వామ్యమే ఓడిపోతుంది! ఈరోజు మీరు చూసిన ఆ షాకింగ్ విజువల్స్ వెనుక… అసలైన సెన్సేషనల్ న్యూస్ బహుశా ఇదే!
Also Read : ఢిల్లీ ఆందోళనలపై కేంద్రం సంచలన నిర్ణయం.. అమల్లోకి NSA యాక్ట్!









