
ఈ రోజుల్లో మనిషి లైఫ్ స్పాన్ ఒక 50 నుంచి 60 ఏళ్ల వరకు ఉంటుంది. ఇంతకు ముందు రోజుల్లో ఆరోగ్యమైన ఫుడ్స్ తీసుకోవడం వల్ల వందేళ్ల వరకు కొందరు జీవించేవారు. అయితే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలని, జీవితాన్ని ఆస్వాదించాలని చాలా మంది కోరుకుంటారు. ఇలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) కూడా అనుకున్నారు. ఈ క్రమంలో తన జీవిత కాలాన్ని వీలైనంత వరకు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పుతిన్ వయస్సు 73 ఏళ్లు. అయినా ఇంకా ఎక్కువ ఏళ్లు జీవించాలనే ఉద్దేశంతో పుతిన్.. ఆధునిక వైద్యాన్నే కాకుండా అనేక రహస్య ప్రయోగాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
తన జీవిత కాలాన్ని పెంచుకోవడానికి పుతిన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ‘ఆంటి-ఏజింగ్’ పరిశోధనలు చేస్తున్నారు. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. కణాల క్షీణతను అడ్డుకునే, ఆయుష్షును పొడిగించే బయోటెక్నాలజీ ప్రయోగాలకు భారీగా ప్రభుత్వ నిధులను కేటాయించారు. వృద్ధాప్యాన్ని జయించాలని రష్యన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
సాంకేతిక పరిశోధనలతో పాటు పుతిన్ తన జీవిత కాలాన్ని పెంచుకోవడానికి తీవ్రమైన సాంప్రదాయ, ప్రాచీన వైద్య విధానాలను కూడా ఉపయోగిస్తున్నట్లు ప్రచారం ఉంది. ముఖ్యంగా సైబీరియన్ ఎర్ర జింకల లేత కొమ్ముల నుండి తీసే రసంతో చేసే ‘బ్లడ్ బాత్’ క్రమం తప్పకుండా చేస్తారని సమాచారం. ఈ ప్రత్యేక స్నానం వల్ల శరీరంలోని నరాల బలహీనత తగ్గి, రక్తప్రసరణ మెరుగుపడి, ఆయుష్షు పెరుగుతుందని విశ్వసిస్తారు. దీనికి తోడు నిత్యం తన వెంట ఎండోక్రినాలజిస్టులు, క్యాన్సర్ నిపుణులతో కూడిన వైద్యుల బృందాన్ని ఉంచుకుంటూ.. తినే ఆహారం నుండి తీసుకునే ఔషధాల వరకు ప్రతిదీ కఠినమైన పర్యవేక్షణలో ఉండేలా చూసుకుంటున్నారు.
Also Read : జాబ్ మానేస్తే 22 లక్షలకు.. ఉద్యోగులకు టాప్ కంపెనీ బంపరాఫర్!
అయితే పుతిన్ లాంటి ప్రపంచ నేతలు ఎంతటి అత్యాధునిక వైద్యాన్ని పొందినా.. తమ జీవిత కాలాన్ని పరిమితికి మించి పెంచుకోవడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మానవ శరీరంలో వృద్ధాప్యానికి కారణమయ్యే కణాలన్నింటినీ తొలగించినప్పటికీ.. మనిషి గరిష్ఠ ఆయుష్షు 156 ఏళ్లు మాత్రమేనని నివేదికలు చెబుతున్నాయి. మహా అయితే 146 నుంచి 194 ఏండ్ల వరకు జీవిస్తారని.. అంతకు మించి జీవించలేరని పరిశోధనలు తెలిపాయి.
శరీరంలో మళ్లీ పునరుత్పత్తి కాలేని కణాల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ ఆయుష్షు పరిమితిని నిర్ధారించారు. కాలేయం వంటి అవయవాలు కొత్త కణాలను ఉత్పత్తి చేస్తూ జన్యు ఉత్పరివర్తనాలను తట్టుకోగలవు. కానీ మానవ ఆయుష్షును ప్రధానంగా శాసించే గుండె, మెదడు అవయవాలు కొత్త కణాలను తయారు చేయలేవు. కాలంతో పాటు వీటిపై మ్యుటేషన్లు పేరుకుపోయి చివరికి వృద్ధాప్య మరణానికి కారణమవుతాయి.
ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న యాంటీ ఏజింగ్ చికిత్సలు, స్టెమ్ సెల్ థెరపీలు శరీరాన్ని కొంతకాలం ఆరోగ్యంగా ఉంచగలవు. కానీ తర్వాత ఇవి పనిచేయవు. ఎంతటి అగ్రనేతలైనా, శతాబ్దాల పాటు బతకాలనే ఆశతో ఎన్ని ప్రయోగాలు చేసినా గుండె, మెదడు కణాల సహజమైన క్షీణతను ఆపడం ఎవరి వల్లా కాదని నివేదికలు చెబుతున్నాయి.
Also Read : వరల్డ్‌ని ముంచేసిన పాక్ ఆర్మీ చీఫ్ డ్రామా.. అసిమ్ మునీర్ క్రూరమైన డార్క్ సీక్రెట్స్ అవుట్!









