
అమెరికా, ఇరాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ ఓ మాస్టర్ మైండ్ ప్లాన్ వేసింది. అమెరికా దళాలకు ఏమీ మిగల్చకూడదనే ఉద్దేశంతో తమ సొంత భూభాగంపైనే బాంబులు(Iran Bombs) వేసుకుని.. సర్వనాశనం చేయడానికి వెనుకాడమని ఇరాన్ సైనిక అధికార ప్రతిప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అక్రమీనియా తెలిపారు.
అమెరికా దళాలు తమ భూభాగంలోకి అడుగుపెడితే, తమ సొంత భూమిపై బాంబులు వేస్తామని స్పష్టం చేశారు. సైనిక భాషలో దీనిని స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ అంటారు. అంటే శత్రువుకు తమ భూమి, భవనాలు, ఆహారం, చమురు వనరులు ఏవీ చిక్కకుండా తమంతట తామే వాటిని ధ్వంసం చేయడం. తమ దేశ ప్రజలకు ఎంత పెద్ద నష్టం వాటిల్లినా సరే.. ఏ పరిస్థితుల్లోనూ అమెరికా సైన్యాన్ని తమ గడ్డపై కాలు మోపనివ్వకూడదనేది ఇరాన్ ప్లాన్.
Also Read : తాలిబన్లకు ఊహించని బిగ్ షాక్.. వారి కోటకే కన్నం వేసిన ఆ మాస్టర్ మైండ్ ఎవరు?
ఒకవేళ ఇరాన్ నిజంగానే ఈ బెదిరింపులను అమలు చేస్తే.. అక్కడ ఊహించని రీతిలో భయంకరమైన ఉద్రిక్తత ఏర్పడుతుంది. తమ సొంత ప్రభుత్వం వేసే బాంబులకు భయపడి లక్షలాది మంది పౌరులు ఉన్న పళంగా ఇళ్లను వదిలేసి పారిపోవాల్సి వస్తుంది. అలాగే ఇరాన్‌లోని చమురు క్షేత్రాలు, విద్యుత్ కేంద్రాలు, ఓడరేవులను వారే పేల్చివేస్తే ఆ దేశ మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమవుతాయి. అంతేకాకుండా చమురు, రసాయన పరిశ్రమల పేలుళ్ల వల్ల వెలువడే విషవాయువులు గాలి, నీటిలో కలిసి రాబోయే తరాల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
మరోవైపు అమెరికా ఇరాన్ లక్ష్యాలపై వరుసగా వైమానిక దాడులను కొనసాగిస్తోంది. ఇరాన్‌ను ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో అమెరికా దాడులకు పాల్పడుతోంది. అమెరికా హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి, ప్రస్తుత ఎంపీ మనూచెహర్ మొట్టాకి మాట్లాడుతూ.. కేవలం క్షిపణులు వేయడమే కాకుండా.. ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసి అమెరికా సైనికులను బందీలుగా పట్టుకుని ఇరాన్‌కు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అమెరికా సైనిక బెదిరింపులను తిప్పికొట్టడానికి ఈ యుద్ధం సరైనదన్నారు.
Also Read : సీన్ రివర్స్.. ఉక్రెయిన్ కాళ్ల దగ్గరకు ట్రంప్.. ఎందుకో తెలుసా?









