
Balakrishna : #NBK111 సినిమా షూటింగ్‌లో హీరో నందమూరి బాలకృష్ణ గాయపడిన తెలిసిన సంగతి తెలిసిందే. దీనిపై మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఆయనకు స్వల్ప కండరాల గాయమైంది. వైద్యుల సలహాతో శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఇది పూర్తిగా సాధరణ ప్రక్రియే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
మరోవైపు బాలకృష్ణ మోకాలికి గాయం కావడంపై దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందించారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన త్వరలోనే కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని స్పష్టం చేశారు. బాలయ్యకి సినిమాపై ఉన్న క్రమశిక్షణ, శ్రమించే తత్వం చిత్రబృందానికి ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు.
బాలకృష్ణ షూటింగ్‌లో గాయపడటంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ హీరోలు కల్యాణ్ రామ్,జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “త్వరగా కోలుకోండి బాబాయ్.. మీకు ఎంతో ఇష్టమైన సినిమాల్లోకి అతిత్వరలోనే మీరు మళ్లీ పూర్తి శక్తితో తిరిగి వస్తారని నమ్ముతున్నాను” అని కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.
Also Read : హీరో బాలకృష్ణకు ప్రమాదం!
Get well soon Babai. ❤️
Wishing you a speedy recovery. I'm sure you will be back in action in no time, doing what you love the most.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) July 21, 2026
ఇక గెట్ వెల్ సూన్ బాలా బాబాయ్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మీరు త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. తిరిగి ఫుల్ ఫామ్ లోకి రావాలని దాని కోసం ఎదురుచూస్తూ ఉంటానని ఎన్టీఆర్ తన ట్వీట్ లో తెలిపారు. ఇక బాల మావయ్య త్వరగా కోలుకుని యధావిధిగా షూటింగ్ లో పాల్గొనాలని మంత్రి లోకేష్ వెల్లడించారు. మరోవైపు బాలయ్య బాబు త్వరగా కోలుకోవాలని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
Also Read : మెగాస్టార్ చిరు హీరోయిన్.. 100 కేజీల బరువుతో సతమతం.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి..!
Get well soon Bala Babai. Wishing you a speedy recovery and good health. Looking forward to seeing you roar back in full form…
— Jr NTR (@tarak9999) July 21, 2026
బాలకృష్ణకు మంత్రి నారా లోకేష్ ఫోన్..
షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణను పరామర్శించిన లోకేష్.. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్న నారా లోకేష్. #NaraLokesh #Balakrishna #andhrapradesh pic.twitter.com/9ay9mjLp3J
— Telugu Stride (@TeluguStride) July 21, 2026









