Tripura DGP : త్రిపుర రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది. ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) అనురాగ్ ధన్‌కర్, అగర్తలాలోని తన ఆఫీసులోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. డ్యూటీలో ఉన్న సమయంలోనే ఈ ఘోరం జరగడంతో పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. తీవ్ర రక్తస్రావమైన ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అనురాగ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సీఎం మాణిక్ సాహా, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించారు. ఆయన బలవన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా త్రిపుర కేడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనురాగ్ ధంకర్.. 2025 మే నెలలో డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. .తన మూడు దశాబ్దాల కెరీర్‌లో, ఆయన ఇంటెలిజెన్స్‌లో కీలక పదవులను నిర్వహించారు, ఆర్కే నగర్‌లో శనివారం జరిగిన 92వ బ్యాచ్ రిక్రూట్ పోలీస్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ లో కూడా అనురాగ్ ధన్‌కర్ పాల్గొన్నారు.

Also Read : ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: పార్లమెంట్ ముట్టడికి ‘సీజేపీ’ పిలుపు.. సీజేపీ చీఫ్ అభిజిత్ దిప్కేఅరెస్ట్

Also Read : కొత్తగా వస్తున్న కరోనాకు పాత వ్యాక్సిన్ పని చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.