
Abhijeet Dipke : ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ 21 రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష శనివారంతో కీలక మలుపు తిరిగింది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో, ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్యుల సూచనల మేరకు పోలీసులు ఆయనను ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. సోనమ్ వాంగ్చుక్ భార్య గీతాంజలి జె. ఆంగ్మో స్పందిస్తూ, తన అనుమతి లేదా కుటుంబ సభ్యులు, వ్యక్తిగత వైద్యుల సంప్రదింపులు లేకుండా ఆయనకు ఎటువంటి చికిత్స లేదా మందులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.
Also Read : విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర… TVK MLAలకు రూ. 35 కోట్ల ఆశ!
మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే, సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన తర్వాత నిరసనను మరింత తీవ్రతరం చేశారు. పోలీసుల నిర్బంధం నుండి విడుదలైన అనంతరం ఆయన జంతర్ మంతర్ వద్ద నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ చర్యతో నిరసన ముగిసిపోదని అన్నారు. వాంగ్చుక్ను బలవంతంగా తీసుకెళ్లడం పట్ల నిరసనగా, తాము ఇకపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా మాత్రమే కాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామాను కూడా డిమాండ్ చేస్తున్నామని ప్రకటించారు.
అంతేకాకుండా, అభిజీత్ దిప్కే స్వయంగా నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. జూలై 20న పార్లమెంటుకు మార్చ్ నిర్వహిస్తామని, తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Also Read : నీట్-యూజీ రీటెస్ట్ ఫలితాలు రిలీజ్.. టాపర్లు వీళ్లే!









