మేనమాతో కలిసి పొలానికి వెళ్లిన 12 ఏళ్ల బాలుడు మొసలికి బలయ్యాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో జరిగింది. ఘఘ్రా నది ఒడ్డున వెళ్తున్న సమయంలో బాలుడిపై మొసలి దాడి చేసింది. అతడిని నోటిలో కరుచుకొని నదిలోకి లాకెళ్లింది. బాలుడిని కాపాడేందుకు మేనమామ ఎంత ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా బాలుడి మృతదేహం లభ్యమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలుడి మృతితో కుటుంబ విషాదంలో మునిగింది.

Also Read : అమెరికాలో హైదరాబాద్ వ్యక్తిపై కత్తి దాడి..ముస్లిం అని తెలిసినందుకు!

Also Read : అత్యాచారం చేశారు న్యాయం చేయమని వెళ్తే.. తిరిగి అత్యాచారం చేసిన లాయర్