
Madhapur : హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మాదాపూర్‌లో దారుణ హత్యోదంతం చోటుచేసుకుంది. రామేశ్వరం కేఫ్ ముందు జరిగిన ఈ ఘాతుకం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, వరంగల్ జిల్లా ఉప్పరపల్లికి చెందిన భాస్కర్ అనే వ్యక్తిని కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన భాస్కర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పరపల్లికి చెందిన భాస్కర్, అదే గ్రామానికి చెందిన నిఖిత అనే యువతిని గతంలో ప్రేమించాడు. అయితే, వీరిద్దరి కులాలు వేరు కావడంతో యువతి కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదు. పెద్దల నిర్ణయం మేరకు మూడేళ్ల క్రితం నిఖితకు మరొకరితో వివాహం జరిపించారు. అయితే, కొన్నాళ్లకే భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా నిఖిత విడాకులు తీసుకుంది.
Also Read : అత్యాచారం చేశారు న్యాయం చేయమని వెళ్తే.. తిరిగి అత్యాచారం చేసిన లాయర్
తన కూతురి వైవాహిక జీవితం నాశనం కావడానికి, విడాకులకు కారణం భాస్కరే అని నిఖిత తండ్రి రాజు నమ్మాడు. దీనిపై ఆయన భాస్కర్‌పై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. గతంలోనే భాస్కర్‌ను చంపేస్తానని రాజు హెచ్చరించినట్లు సమాచారం. ఈ పాత కక్షలే చివరికి మాదాపూర్‌లో జరిగిన దారుణ హత్యకు దారితీశాయని తెలుస్తోంది.
గతంలో భాస్కర్ నిఖితతో పాటుగా పలువురు యువతులను తీవ్రంగా వేధించినట్లు సమాచారం. ఈ విషయమై బాధితులు అప్పట్లోనే మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు భాస్కర్‌కు కౌన్సెలింగ్ ఇచ్చినా, అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా, బాధితులైన యువతుల తండ్రికి ఫోన్ చేసి, దమ్ముంటే హైదరాబాద్ రండి అంటూ భాస్కర్ సవాల్ విసిరాడు.
ఈ మాటలతో ఆగ్రహానికి గురైన యువతుల తండ్రి, నిందితుడైన రాజుతో కలిసి వరంగల్ నుండి హైదరాబాద్‌కు వచ్చారు. పక్కా ప్లాన్ ప్రకారం తన బంధువు కుమారస్వామితో కలిసి భాస్కర్ కోసం వేచి చూసిన రాజు, రామేశ్వరం కేఫ్ వద్ద అతడిపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితులు రాజు, కుమారస్వామి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
Also Read : తల్లిదండ్రుల నిత్య కలహాలు: మనస్తాపంతో 15 ఏళ్ల బాలుడు బలవన్మరణం








