
Donald Trump : హోర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ ప్రాంతంపై తన ఆధిపత్యాన్ని ప్రకటిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేయగా, ఇరాన్ దీటుగా స్పందించింది.
హోర్మూజ్ జలసంధిని ఇకపై అమెరికా తన ఆధీనంలోకి తీసుకుంటుందని ట్రంప్ ప్రకటించారు. తాము గార్డియన్ ఆఫ్ హోర్మూజ్ స్ట్రెయిట్ గా వ్యవహరిస్తామని, ఈ ప్రాంతంలో భద్రత కల్పించేందుకు అయ్యే ఖర్చుల కోసం ఇక్కడి నుంచి వెళ్లే అన్ని వాణిజ్య నౌకలపై 20 శాతం సుంకం వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఇరానియన్ బ్లాకేడ్ ద్వారా ఇరాన్ నౌకలను మాత్రమే నిలువరిస్తామని, ఇతర దేశాల నౌకలకు ఇది వర్తించదని ఆయన తెలిపారు.
Also Read : పహల్గామ్ ఉగ్రదాడి కేసు.. ఎల్ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్‌కు బిగుస్తున్న ఉచ్చు
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హోర్మూజ్ నిర్వహణలో అమెరికా జోక్యాన్ని తాము ఏమాత్రం సహించబోమని తేల్చి చెప్పింది. అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఈ విషయంలో అమెరికాకు మద్దతు ఇచ్చే ఏ దేశమైనా యుద్ధంలో భాగస్వామిగా పరిగణించబడుతుందని ఇతర దేశాలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.
పరిస్థితి అదుపు తప్పుతోంది. ఇరాన్ ఇప్పటికే తన వ్యూహాత్మక ఆపరేషన్ ఐ ఫర్ యాన్ ఐ పేరుతో కువైట్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌లపై దాడులకు దిగింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఫ్యూయల్ ట్యాంకులు కీలకమైన ఎయిర్‌బేస్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఇరాన్ మీడియా పేర్కొంది.
Also Read : ఇరాన్ ‘హిట్‌లిస్ట్’: ట్రంప్, నెతన్యాహుతో సహా 13 మంది ప్రపంచ నేతలే లక్ష్యం…









