
Telangana : షాబాద్ నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ ఉన్మాదం రెండు కుటుంబాలను నిలువునా ముంచేసింది. ఒక సైకో వేధింపుల వల్ల ఆరుగురు అమాయకులు బలైపోగా, చివరకు మిగిలింది ఆ ఒక్క బాలికే. ఆ బాలిక సోదరి ఇప్పుడు దిక్కులేని అనాథగా మారిన వైనం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ప్రేమ పేరుతో మొదలైన వేధింపులు చివరకు మారణహోమానికి దారితీశాయి. తనపై పోక్సో కేసు నమోదు చేసిన కక్షతో రాజ్ కుమార్ అనే వ్యక్తి, బాలికతో పాటు ఆమె తల్లి, అమ్మమ్మను దారుణంగా హత్య చేశాడు. కసి తీరని ఆ ఉన్మాది, ఆ తర్వాత తన సొంత ఇంటికి వెళ్లి తన భార్యను, ఇద్దరు చిన్నారులను కూడా హతమార్చాడు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో ఆ బాలిక ప్రాణాలతో బయటపడగా, ఆమె అక్క ఇప్పుడు తోడూ నీడ లేక అనాథగా మిగిలిపోయింది. ఆ కుటుంబాన్ని ఊడ్చేసిన ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
హత్యలకు పాల్పడిన రాజ్ కుమార్, పోలీసులకు దొరకకుండా కొత్తూరు సమీపంలోని పెంజర్ల వద్ద విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు అతడి కుటుంబ సభ్యులను సంప్రదించారు. అయితే, ఆ నరహంతకుడితో తమకు ఎటువంటి సంబంధం లేదని, మృతదేహాన్ని తీసుకునే ప్రసక్తే లేదని కుటుంబ సభ్యులు రాతపూర్వకంగా పోలీసులకు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు చేవెళ్ల శ్మశానవాటికలో రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తి చేశారు.
Also Read : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై జోరుగా ప్రచారం: స్పష్టత ఇచ్చిన ఫ్యాన్స్ అసోసియేషన్
హత్యల అనంతరం పోలీసులకు దొరకకుండా తిరిగిన రాజ్ కుమార్, చివరకు తన మేనమామ ఊరైన కొత్తూరు సమీపంలోని పెంజర్ల వద్ద మృతి చెంది ఉన్నాడు. ఒక వెంచర్ వద్ద పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ లభ్యమవడంతో అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
హత్యలకు ఒక రోజు ముందు రాజ్‌కుమార్ ఒక సెల్ఫీ వీడియోను కూడా రికార్డు చేశాడు. ఆ వీడియోలో నేను ఆ అమ్మాయిని నమ్ముకొని చాలా మోసపోయా. ఆ కుటుంబం నన్ను అన్ని విధాలా వాడుకొని మోసం చేసింది. దీనివల్ల నేను అప్పుల పాలయ్యాను, జీవితం మీద విరక్తి కలిగింది. చివరికి నా పిల్లలకు కూడా ఉండటానికి చోటు లేకుండా పోయింది” అని కన్నీటి పర్యంతమయ్యాడు.
కుటుంబ సభ్యులను కోల్పోయి, అనాథగా మారిన ఆ బాలిక పరిస్థితిని చూసి ప్రభుత్వం స్పందించింది. ఆమె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. రాజ్ కుమార్ చేసిన ఈ అఘాయిత్యం వల్ల ఇప్పుడు ఆ బాలిక ప్రాణాలతో ఉన్నా.. జీవితాంతం గుర్తుండిపోయే గాయంలా మిగిలిపోయింది.
Also Read : పచ్చి పాలపై సంచలన నివేదిక: ఒక పొంగుతో దించితే రోగాలే..









