
TG TET Results 2026 : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET-2026) ఫలితాలను జులై 13 (సోమవారం) మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్షల్లో 43.94 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జూన్ 16 నుంచి 22 వరకు మొత్తం 10 సెషన్లలో ఈ పరీక్షలను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించారు. ఈ టెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,15,028 మంది (74.81%) పరీక్షకు హాజరయ్యారు. హాజరైన వారిలో మొత్తం 50,544 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
Also Read : పచ్చి పాలపై సంచలన నివేదిక: ఒక పొంగుతో దించితే రోగాలే..
కేటగిరీల వారీగా ఫలితాలు
కమ్యూనిటీల వారీగా పరిశీలిస్తే, ST అభ్యర్థులు 51.03 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలిచారు.
BC అభ్యర్థులు: 40.36% ఉత్తీర్ణత
EWS అభ్యర్థులు: 22.43% ఉత్తీర్ణత
జనరల్ కేటగిరీ: 20.15% ఉత్తీర్ణత సాధించారు.
ఫలితాల్లో మహిళల ప్రతిభ & ట్రాన్స్జెండర్ల ప్రాతినిధ్యం
మెరుగైన ప్రతిభ: ఈ ఫలితాల్లో పురుషుల కంటే మహిళా అభ్యర్థులే అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు.
పేపర్-II (మ్యాథ్స్ & సైన్స్): ఈ విభాగంలో 32,555 మంది మహిళలు హాజరుకాగా 12,495 మంది, 11,567 మంది పురుషులు హాజరుకాగా 5,488 మంది క్వాలిఫై అయ్యారు.
పేపర్-II (సోషల్ స్టడీస్): ఈ విభాగంలో 23,008 మంది మహిళలు పరీక్ష రాయగా 5,009 మంది అర్హత సాధించారు.
ట్రాన్స్జెండర్ల ఫలితాలు: పేపర్-I రాసిన నలుగురు ట్రాన్స్జెండర్లలో ఇద్దరు, పేపర్-II (మ్యాథ్స్) రాసిన ఆరుగురిలో నలుగురు అర్హత సాధించడం విశేషం.
ఇన్సర్వీస్ టీచర్ల పరిస్థితి & త్వరలో ‘ప్రత్యేక టెట్’
పరీక్షకు హాజరైన వారిలో 23,623 మంది ఇన్సర్వీస్ (ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న) ఉపాధ్యాయులు ఉండగా, వారిలో ఉత్తీర్ణత శాతం 37.29% గానే నమోదైంది.
ఈ నేపథ్యంలో ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం మరొక అవకాశం కల్పించనుంది:
ప్రత్యేక నోటిఫికేషన్: ఇన్సర్వీస్ టీచర్ల కోసం జులై 21న ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
పరీక్షల తేదీలు: ఈ ప్రత్యేక టెట్ పరీక్షలను సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు.
Also Read : దేశంలోనే సరికొత్త చరిత్ర: తెలంగాణలో ‘రైతు డిస్కం’ ఏర్పాటుకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్!
ఫలితాలు చూసుకునే విధానం:
పరీక్ష రాసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in లో మార్కులు, క్వాలిఫైయింగ్ స్టేటస్, ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.









