
Bhagyashri Borse : ప్రస్తుతం టాలీవుడ్ లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న నటి భాగ్యశ్రీ బోర్సే, తాజాగా విడుదలైన లెనిన్ సినిమా విజయంతో చాలా సంతోషంగా ఉన్నారు. అయితే, ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి చెప్పారు. ఔరంగాబాద్‌లో జన్మించిన భాగ్యశ్రీ, తన చిన్నతనంలో కొంతకాలం నైజీరియాలోని లాగోస్‌లో నివసించారు. ఆ తర్వాత తిరిగి ఇండియాకు తిరిగి వచ్చింది.
Also Read : ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి లవ్ జిహాద్.. మంత్రి సంచలన కామెంట్స్!
తను ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చానని, చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను చాలా దగ్గరగా చూశానని భాగ్యశ్రీ అన్నారు. తన తండ్రి ఉద్యోగం కోల్పోయినప్పుడు కుటుంబం గడవడానికి ఆయన పడ్డ ఇబ్బందులను చూసి తను ఎంతో బాధపడేదానిని అని చెప్పారు. ఒకానొక సందర్భంలో తన తండ్రి మరొకరి దగ్గర ఉద్యోగం కోసం బతిమాలడం తను కళ్లారా చూశానని, నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు, దయచేసి నాకు ఏదైనా పని ఇవ్వండి అని ఆయన వేడుకోవడం తన మనసును కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు తండ్రి పడ్డ ఆవేదన చూశాక, ఎప్పటికైనా కష్టపడి డబ్బు సంపాదించి తన కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలని అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నానని ఆమె తెలిపారు.
సినిమా కెరీర్ విషయానికి వస్తే, భాగ్యశ్రీ మొదట చందూ ఛాంపియన్, యారియాన్ 2 వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. రవితేజ సరసన నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్‌డమ్ ఆమె క్రేజ్‌ను మరింత పెంచింది. రామ్ సరసన ఆంధ్ర కింగ్ తాలుకా, దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘కాంత’ సినిమాలో ఆమె నటించింది. తాజాగా అఖిల్ తో నటించిన లెనిన్ సినిమా ఆమెకు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తీసుకువచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
Also Read : థియేటర్లలో అక్కినేని ఫ్యాన్స్ జాతర.. అఖిల్ ఖాతాలో మరో హిట్.. లెనిన్ మూవీ ఎలా ఉందంటే?









