US-Iran War
US-Iran War

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్‌పై భారీ దాడులు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే అమెరికా సైన్యం విరుచుకుపడింది. దీంతో ఇరాన్ గల్ఫ్ దేశాలలో విస్తరించి ఉన్న అమెరికా ప్రధాన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ తాజా దాడుల్లో బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత కీలకమైన ‘ఫిఫ్త్ ఫ్లీట్’ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి చేసింది. దీనితో పాటు కువైట్, ఖతార్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. తమ దేశం వైపు దూసుకొస్తున్న ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లను గాల్లోనే అడ్డుకుంటున్నట్లు కువైట్ రక్షణ శాఖ ప్రకటించింది. ఈ పరిణామాలతో గల్ఫ్ రీజియన్ మొత్తం యుద్ధ మేఘాలతో దద్దరిల్లుతోంది.

అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో వెళ్తున్న వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం వల్లే ఈ ఘర్షణలు మొదలయ్యాయని అమెరికా స్పష్టం చేసింది. సముద్ర మార్గంలో నౌకాయాన స్వేచ్ఛకు భంగం కలిగిస్తే అస్సలు సహించబోమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ చేసే ప్రతి ఒక్క దాడికి తాము 20 రెట్లు ఎక్కువ తీవ్రతతో దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తుర్కియే పర్యటన ముగించుకుని తన అధికారిక విమానం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’లో వస్తూ ట్రంప్ మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read : స్టాక్ మార్కెట్లలో బ్లడ్‌బాత్: రూ.8 లక్షల కోట్లు ఆవిరి.. ట్రంప్ ఒక్క ప్రకటనతో కుప్పకూలిన సూచీలు

రాత్రి వేళ అమెరికా జరిపిన దాడుల ధాటికి తట్టుకోలేక ఇరాన్ ప్రభుత్వం తమతో రాజీ కోసం ప్రయత్నిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వం నుంచి మాకు ఫోన్ కాల్ వచ్చింది. వారు చర్చల కోసం, ఒప్పందం కోసం తహతహలాడుతున్నారు. అయితే వారు ఆ డీల్‌కు అర్హులా కాదా, కుదిరిన ఒప్పందాన్ని వారు గౌరవిస్తారా లేదా అనే విషయాలపై నాకు ఇంకా నమ్మకం లేదు. అదే ఇప్పుడు అసలైన సమస్య అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే అమెరికా దళాలు ఇరాన్‌కు చెందిన బందర్ అబ్బాస్, సిరిక్, జస్క్ నగరాలతో పాటు, అణు ప్లాంట్ ఉన్న బుషెహర్, అబూ మూసా ద్వీపాల్లోని కీలక రక్షణ కేంద్రాలపై క్షిపణుల వర్షం కురిపించాయి.

ఇరాన్ భూభాగంలోని దాదాపు 90 వ్యూహాత్మక లక్ష్యాలను తాము విజయవంతంగా ధ్వంసం చేశామని అమెరికా సైన్యానికి చెందిన ‘సెంట్రల్ కమాండ్’ అధికారికంగా ప్రకటించింది. అమెరికా క్షిపణులు ధ్వంసం చేసిన వాటిలో మషహద్ నగరానికి వెళ్లే రెండు ప్రధాన వంతెనలు కూడా ఉన్నాయని ఇరాన్ వెల్లడించింది. ఇటీవల అమెరికా దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ పార్థివ దేహాన్ని ఈ మషహద్ నగరంలోనే సమాధి చేయడానికి ఇరాన్ ఏర్పాట్లు చేస్తోంది. సరిగ్గా అంత్యక్రియలు జరిగే రోజునే ఆ నగరానికి వెళ్లే మార్గాలను అమెరికా లక్ష్యంగా చేసుకోవడంతో ఇరాన్ ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది.

Also Read : మోదీ మాస్టర్ ప్లాన్.. చైనాకు ఊహించని షాక్.. ఇండోనేషియా టూర్ వెనుక సీక్రెట్ ఇదే!