
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న సైనిక ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ రంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ప్రాంతంలో నౌకలపై దాడులు, ఎదురుదాడులు జరుగుతుండటంతో గ్యాస్ సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పై నేరుగా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే దేశంలో ఇంధన సంక్షోభం కూడా తలెత్తే ముప్పు ఉందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : అమెరికా వెళ్లాలనుకునే టెకీలకు షాకింగ్ న్యూస్.. H-1B వీసా స్కామ్.. జేడీ వాన్స్ సంచలన ప్రకటన!
భారతదేశానికి అవసరమైన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ దిగుమతుల్లో మెజారిటీ వాటా ఖతార్ దేశం నుంచే వస్తుంది. ఖతార్ నుంచి వచ్చే ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లు ఖచ్చితంగా హర్ముజ్ జలసంధి మార్గం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సముద్ర మార్గంలో యుద్ధ వాతావరణం నెలకొనడం, చమురు ట్యాంకర్లపై దాడులు జరుగుతుండటంతో ఖతార్ నుంచి భారత్‌కు జరిగే గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగేలా కనిపిస్తోంది. ఒకవేళ ఈ మార్గంలో రవాణా పూర్తిగా నిలిచిపోతే.. భారత్‌లో సహజ వాయువు కొరత భారీగా ఏర్పడే అవకాశం ఉంది.
ఈ అంతర్జాతీయ సంక్షోభం కారణంగా దేశీయంగా సామాన్యుడిపై మోయలేని భారం పడనుంది. పరిశ్రమలకు, వాహనాలకు వాడే సీఎన్‌జీతో పాటు ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా సరఫరా చేసే పీఎన్‌జీ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల ధరలపై కూడా దీని ప్రభావం గట్టిగా పడుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ కొరత ఏర్పడితే ఓపెన్ మార్కెట్ నుండి ఎక్కువ ధర చెల్లించి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఆ భారాన్ని చివరకు వినియోగదారులపైనే వేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో గ్యాస్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : ట్రంప్ వార్నింగ్.. గంటల్లోనే యాక్షన్.. ఇరాన్‌పై అమెరికా క్షిపణుల వర్షం!









