
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు TGPSC(TGPSC Notification) శుభవార్త చెప్పింది. వ్యవసాయ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ (TSSOCA) లో ఖాళీగా ఉన్న సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ (విత్తన ధృవీకరణ అధికారి) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Also Read : బంగారం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు
మొత్తం ఖాళీలు – 19
అర్హత: వ్యవసాయ శాస్త్రంలో బేసిక్ డిగ్రీతో పాటు ICAR గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి సీడ్స్ టెక్నాలజీ/ ప్లాంట్ బ్రీడింగ్/ అగ్రోనమీ/ ప్లాంట్ ఫిజియాలజీ విభాగాలలో పీజీ M.Sc.(Ag.) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వయోపరిమితి: SC, ST,BC, EWS అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో సాధించిన మార్కులు, మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
వేతనం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వేతనం నెలకు రూ.51,320 నుంచి రూ.1,27,310 వరకు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు TGPSC అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రారంభ-చివరి తేదీ: అభ్యర్థులు జులై 7 నుంచి ఆగస్టు 12వ తేదీ లోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
గమనిక: ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://www.tgpsc.gov.in అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
Also Read : కొత్త ఇల్లు మారారా.. SIR ప్రక్రియలో ఓటు మార్చుకోకపోతే వచ్చే ఇబ్బందులు ఇవే!










