
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌లో Google Pixel 10 ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. దీనిపై ఏకంగా రూ.16వేల భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అందువల్ల ఎప్పటి నుంచో గూగుల్ ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం అనే చెప్పాలి. ఇప్పుడు దీని ధర, ఆఫర్లు, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read : జైపూర్‌లో ఘోరం: మరో ఎగ్జామ్ స్కామ్..రూ. 5లక్షలు ఇస్తే పాస్..
Google Pixel 10 Price
Google Pixel 10 మొబైల్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ఆగస్టు 2025లో రూ. 79,999 ధరకు విడుదల అయింది. ఇప్పుడు Amazonలో రూ.63,750 ధరకు అందుబాటులో ఉంది. అంటే లాంచ్ ధర కంటే దాదాపు రూ.16,249 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే బ్యాంక్ ఆఫర్లో భాగంగా.. HSBC క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 5% తక్షణ తగ్గింపు (రూ. 3000 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత దీనిని కేవలం రూ. 60,750కి కొనుక్కోవచ్చు.
ఇది కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ. 30,900 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ గరిష్ట ప్రయోజనం పొందాలంటే.. పాత ఫోన్ కండీషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఇలా డైరెక్ట్ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మొత్తం కలిపి రూ.50,149 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ మొత్తం డిస్కౌంట్ వర్తిస్తే Google Pixel 10 ఫోన్ కేవలం రూ.29,850లకే లభిస్తుంది.
Also Read : తగ్గిన ముడిచమురు ధరలు… దిగిరాని పెట్రోల్, డీజిల్ ధరలు..ఎందుకో తెలుసా?
Google Pixel 10 Specifications
Google Pixel 10లో 1080×2424 పిక్సెల్ రిజల్యూషన్, 60-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌తో కూడిన 6.3-అంగుళాల యాక్చువా OLED డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఇందులో 4,970mAh బ్యాటరీ ఉంది. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్, 10W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. Google Pixel 10 వెనుక భాగంలో 48-మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 10.8-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 10.5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.









