Samsung Galaxy M47 5G
Samsung Galaxy M47 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ శాంసంగ్ తన లైనప్‌లో ఉన్న Samsung Galaxy M47 5Gను భారతదేశంలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ రేపు (జూన్ 29) భారత మార్కెట్లోకి రానుంది. Samsung Galaxy M47 5G ఫోన్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, భారీ 6000mAh బ్యాటరీ ఉండనున్నాయి.

Also Read : ఊరమాస్ సేల్ మావా: రూ.22వేల భారీ డిస్కౌంట్.. iphone 17 సిరీస్‌ ఆఫర్ ధరలివే..!

Samsung Galaxy M47 5G Launch Date

భారతదేశంలో Samsung Galaxy M47 5G విడుదల తేదీ ఖరారైంది. ఈ శాంసంగ్ ఫోన్ జూన్ 29న మార్కెట్లో లాంచ్ కానుంది. తాజాగా ఈ బ్రాండ్ ఫోన్‌లోని దాదాపు అన్ని స్పెసిఫికేషన్లను వెల్లడించింది. Samsung Galaxy M47 5G రెండు కలర్‌లలో వస్తుందని కంపెనీ వెల్లడించింది. అందులో రోగ్ రెడ్, బ్లేజ్ బ్లూ కలర్‌లు ఉన్నాయి. కాగా ఈ ఫోన్ ధరను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. భారతదేశంలో దీని ధర సుమారు రూ.30,000 ఉండవచ్చని నిఫుణులు భావిస్తున్నారు.

Also Read : మళ్లీ నోట్ల రద్దా? పాత నోట్లు జూన్ 30 తర్వాత చెల్లవా?

Samsung Galaxy M47 5G Features

Samsung Galaxy M47 5Gలో 6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 4 రెట్లు స్క్రాచ్ రెసిస్టెన్స్ ఫీచర్ అందించారు. అలాగే 2 మీటర్ల ఫాల్ రెసిస్టెన్స్ కూడా అందుబాటులో ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ సేఫ్టీని కూడా కంపెనీ అందించింది. Samsung Galaxy M47 5G ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 SoCతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16తో పాటు, వన్ UI 8.5తో వస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో OIS సపోర్ట్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో షూటర్ ఉంది. ముందు భాగంలో పంచ్-హోల్‌లో 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. Samsung Galaxy M47 5G ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6000mAh బ్యాటరీ ఉంటుంది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.