
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో తాజాగా తన నెక్స్ట్ మోడల్ Oppo Reno 16 Pro ను ప్రపంచ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను ఒప్పో రెనో 16 సిరీస్ కింద విడుదల చేసింది. ఇది 5G కనెక్టివిటీతో వస్తుంది. Oppo Reno 16 Pro 5Gలో 1.5K రిజల్యూషన్‌తో కూడిన AMOLED డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్ స్మూత్ స్క్రోలింగ్‌ను అందిస్తుంది. దీని స్క్రీన్ 1800 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. Oppo Reno 16 Pro ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8550 సూపర్ చిప్‌సెట్ అందించారు. అలాగే ఇందులో 6700mAh బ్యాటరీ ఉంది. ఇప్పుడు దీని ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Oppo Reno 16 Pro Price
Oppo Reno 16 Pro 5జీ 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర సుమారుగా రూ. 76,000గా కంపెనీ నిర్ణయించింది. ఇది స్టార్‌లైట్ బ్లాక్, పాప్ వైట్ కలర్‌లలో లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను థాయ్‌లాండ్, మలేషియాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్, Oppo.com లో అందుబాటులో ఉంది.
Oppo Reno 16 Pro specifications
Oppo Reno 16 Pro 5G మొబైల్ 6.32-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్ (2460×1216 పిక్సెల్స్)కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. దీని డిస్‌ప్లే గరిష్టంగా 1800 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ Oppo Reno 16 Pro ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8550 సూపర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16తో వస్తుంది.
కంపెనీ ఈ ఫోన్‌కు స్నాప్ కీ అనే ఒక స్పెషల్ AI-ఆధారిత ఫీచర్‌ను అందించింది. ఇది ఒక సైడ్ బటన్.. దీనిని వివిధ రకాలుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. వినియోగదారులు ఈ బటన్ ద్వారా నేరుగా AI ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు. దీనివల్ల మెనూల ద్వారా నావిగేట్ చేయాల్సిన అవసరం ఉండదు.
Oppo Reno 16 Pro 5G కెమెరా సెటప్‌లో డ్యూయల్-యాక్సిస్ OISతో కూడిన 200MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. ఈ ప్రైమరీ కెమెరాతో పాటు 50MP అల్ట్రావైడ్-యాంగిల్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 50MP ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6700mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో సౌండ్ కోసం స్టీరియో స్పీకర్లు, సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68, IP69, IP69K రేటింగ్‌లు ఉన్నాయి. దీని వల్ల ఇది నీటిలో తడిసినా ఏం కాకుండా ఉంటుంది.









