Diploma in Magic : మ్యాజిక్ నేర్చుకోవాలి అనుకున్న వారికీ/ మెజీషియన్లకు హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. విశ్వవిద్యాలయంలో డిప్లొమా ఇన్‌ మ్యాజిక్ కోర్సుకోసం యూనివర్సిటీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏడాది శిక్షణకాలానికి గాను ఆసక్తి ఉన్నవారు యూనివర్సిటీలో సంప్రదించవచ్చని నిర్వహాకులు తెలిపారు. అంతర్జాతీయ మెజీషియన్‌ సామల వేణు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కోర్సుకు గాను పదవతరగతి పాస్‌ అయిన వారందరూ అర్హులే అని తెలిపారు.
ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు రెగ్యులర్‌ కోర్సు నిర్వహించబడుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది : 30/06/2026.  వివరాలకు  సంప్రదించవల్సిన నంబర్లు : 9059794553, 9246150156.
 𝙰𝚙𝚙𝚕𝚒𝚌𝚊𝚝𝚒𝚘𝚗 𝚕𝚒𝚗𝚔: https://www.pstucet.org/home.do
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.