
బ్యాంక్ ఉద్యోగాల కోసం శ్రమిస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. SBI తాజాగా ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1500 ఖాళీలను భర్తీ చేయనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మొత్తం ఖాళీలు: 1500
విభాగాల వారీగా ఖాళీలు:
అన్‌రిజర్వ్డ్ 588
ఈడబ్ల్యూఎస్ 144
ఓబీసీ 390
ఎస్సీ 234 (రెగ్యులర్ 216, బ్యాక్లాగ్ 18)
ఎస్టీ 144 (రెగ్యులర్ 108, బ్యాక్లాగ్ 36) ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: అభ్యర్థులకు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. OBCలకు మూడేళ్లు, SC/STలకు ఐదేళ్లు, PWBDలకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంది.
దరఖాస్తు ప్రక్రియ : జూన్ 18న ప్రారంభం
దరఖాస్తు లాస్ట్ డేట్: జులై 8.
దరఖాస్తు ఫీసు: అన్‌రిజర్వ్డ్, EWS, OBC అభ్యర్థులకు రూ.750. SC, ST, PWBD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ప్రిలిమినరీ ఎగ్జామ్: ఆగస్టు 2026.
మెయిన్ ఎగ్జామ్: సెప్టెంబర్ 2026.
మరిన్ని విరాలకు వెబ్‌సైట్ ibpsreg.ibps.in/sbipojun26ను సందర్శించండి.









