Prakasam District Cheemakurthi Suicide
Prakasam District Cheemakurthi Suicide

కుటుంబ కలహాలు, మనస్పర్థాలు, క్షణికావేశం కారణంగా ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. భార్యపై అనుమానంతో కొందరైతే, భర్తను వదిలించుకోవాలని మరికొందరు.. ఇలా తమ జీవితాలతో పాటు పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. అనాలోచిత నిర్ణయాలకు చిన్నారులు సైతం బలైపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనలే ఏపీలో చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో జరిగిన రెండు ఇన్సిడెంట్లలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలచివేశాయి.

Also Read : ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో చెక్ చేసుకోండిలా..

ప్రకాశంలో ఘోరం

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చీమకుర్తి మండలం అగ్రహారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపేశాడు. ఆపై అతడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 35 ఏళ్ల ఎకుల సుధాకర్ అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురయ్యాడు. దీంతో భార్య లేని జీవితం తనకు, తల్లి లేని జీవితం తన పిల్లలకు వద్దనుకుని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కన్న ప్రేమని మరిచి తన ముగ్గురు కుమార్తెలు గోచిత (13), పూజిత (11), లోకిత శ్రీ (8)లకు విషమిచ్చి హతమార్చాడు. ఆపై అతడు ఊరి శివారులోని ఓ పొలంలో చెట్టుకు ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడ్డాడు. ఒకే ఊరిలో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read : టెలిగ్రామ్‌ నేరగాళ్లకు అడ్డా…: కేంద్రం సంచలన ఆరోపణలు

శ్రీకాకుళంలో మరో విషాదం:

శ్రీకాకుళం జిల్లాలో సైతం ఇలాంటి మరో దారుణమైన ఘటనే జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది. పలాస-తాళభద్ర రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై ఒక మహిల, ఇద్దరు పిల్లల డెడ్ బాడీలు పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలెట్టారు.