ap ssc advanced supplementary results released by nara lokesh
ap ssc advanced supplementary results released by nara lokesh

ఏపీలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల రిజల్ట్స్ వచ్చేశాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఈ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు ఈ లింక్ క్లిక్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.

https://results.bse.ap.gov.in/

కాగా రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి, అలాగే మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు దాదాపు పది రోజుల పాటు వివిధ పరీక్షా కేంద్రాల్లో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 వేల మంది విద్యార్థులు ఈ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఎగ్జామ్స్ పూర్తయిన కొద్ది రోజుల్లోనే విద్యాశాఖ మూల్యాంకనం చేపట్టి పూర్తి చేసింది. విద్యార్థుల పైచదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫలితాలను త్వరగానే విడుదల చేసింది.