
విమానయాన రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించి, పర్యావరణహిత ప్రయాణాలను అందుబాటులోకి తెచ్చే దిశగా చైనా మరో సంచలన విజయం సాధించింది. చైనా ప్రభుత్వ రంగ సంస్థ ‘కొమాక్’ స్థానికంగా అభివృద్ధి చేసిన CE-25A ఎలక్ట్రిక్ విమానం, పైలట్లతో కూడిన తన తొలి టెస్ట్ ఫ్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
షాండాంగ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ పరీక్షలో ఇద్దరు పైలట్లు సహా మొత్తం ముగ్గురు సిబ్బంది ప్రయాణించారు. గాల్లో 16 నిమిషాల 38 సెకన్ల పాటు ప్రయాణించిన ఈ విమానం సుమారు 60.4 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. ప్రముఖ బ్యాటరీ దిగ్గజం CATL, షాంఘై జియావో టోంగ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో దీనిని రూపొందించారు.
Also Read : వాషింగ్టన్లో మొస్సాద్-CIA సీక్రెట్ మీటింగ్.. నెతన్యాహు, ట్రంప్ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
This is blowing my mind 🤯 China has developed a 10-ton-class electric passenger jet that can fly either with a pilot or fully autonomously.
It can carry 19 passengers, cruise at 300 km/h, and fly up to 400 km.
The plane completed its first piloted flight today in China. Its first autonomous flight was back in February, and it has completed 19 unmanned verification flights.
— Li Zexin 李泽欣 (@XH_Lee23) November 14, 2026
Also Read : అమెరికాలో విమాన సంక్షోభం.. ఆ తప్పు మాది కాదంటూ.. అసలు నిజం బయటపెట్టిన మైక్రోసాఫ్ట్!
CE-25A స్పెసిఫికేషన్లు:
సామర్థ్యం: 19 మంది ప్రయాణికులు (10 టన్నుల గరిష్ట టేకాఫ్ బరువు).
రేంజ్ & స్పీడ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 400 కి.మీ. దూరం, గంటకు 300 కి.మీ. వేగంతో 2,400 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది.
టెక్నాలజీ: సాధారణ జెట్ ఇంజిన్లకు బదులుగా ఇందులో ‘ఎలక్ట్రిక్ డక్టెడ్-ఫ్యాన్ ప్రొపల్షన్’ సిస్టమ్ వాడారు. వాణిజ్య కార్యకలాపాలకు అవసరమైన ‘టైప్ సర్టిఫికేషన్’ ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైంది.
గ్లోబల్ రేసులో ఎలక్ట్రిక్ విమానాలు: కేవలం CE-25A మాత్రమే కాదు, చైనాకు చెందిన ఆటోఫ్లైట్ () సంస్థ 10 మంది ప్రయాణించే ‘మ్యాట్రిక్స్’ (Matrix) ఎలక్ట్రిక్ విమానాన్ని రూపొందించింది. మరోవైపు అమెరికాకు చెందిన హార్ట్ ఏరోస్పేస్ (36 సీట్ల విమానం), ఎలక్ట్రా (EL9 అల్ట్రా షార్ట్) వంటి కంపెనీలు కూడా హైబ్రిడ్-ఎలక్ట్రిక్ విమానాల తయారీలో పోటీ పడుతున్నాయి. గతంలో 2003లోనే జర్మనీకి చెందిన ‘లాంగే E1 అంటారెస్’ సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ గ్లైడర్‌తో ఈ ప్రస్థానానికి బీజం పడింది.
భవిష్యత్తులో రీజనల్ ప్రయాణాలకు ఎలక్ట్రిక్ విమానాలు గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయి. అయితే, పూర్తిస్థాయి కమర్షియల్ సర్వీసులు మొదలవడానికి మరిన్ని సేఫ్టీ టెస్టులు, రెగ్యులేటరీ క్లియరెన్స్‌లు కీలకం కానున్నాయి.









